Sri Prabhas : పేరు మార్చుకున్న ప్రభాస్.. ఇక నుంచి ‘శ్రీ’ ప్రభాస్!

- Advertisement -

Sri Prabhas : గత కొంత కాలంగా ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులందరూ కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న సినిమా కల్కి. నేడు చాలా గ్రాండ్ గా థియేటర్లలో విడుదలైంది. దీంతో ప్రభాస్ అభిమానులు, సినీ ప్రేక్షకుల ఆనందానికి అవధుల్లేవు. అందరూ థియేటర్లకు బారులు తీరుతున్నారు. అయితే కల్కి మొదటి షోతోనే హిట్ టాక్ తెచ్చుకుంది. సినిమా కోసం కోట్లాదిమంది వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఇండియాలో కల్కి మూవీకి సంబంధించిన ప్రీమియర్ షోలు పడిపోయాయి. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ పబ్లిక్ టాక్ బయటకు వచ్చేసింది. పాన్ ఇండియా హీరో ప్రభాస్.. నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటానీ, కమల్‌ హాసన్‌, శోభన కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది ఈ సినిమా.. ప్రీమియర్ షోస్ తోనే ఆ అంచనాలు రీచ్ అయింది.

Sri Prabhas
Sri Prabhas

పురాణాలను, భవిష్యత్‌ను కలుపుతూ.. నాగ్ అశ్విన్‌ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా ప్రకటించిన అప్పటి నుంచే ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పోస్టర్లు, ట్రైలర్లు ఆ అంచనాలను మరింత పెంచేశాయి. నేడు (జూన్‌ 27) కల్కి చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ప్రభాస్ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.

- Advertisement -

అయితే ఈ సినిమాతో ప్రభాస్ పేరు మారిపోయింది. ప్రభాస్‌కు గతంలో ‘రెబల్ స్టార్’ అనే ట్యాగ్ లైన్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. గత సినిమాల్లో రెబల్ స్టార్ ప్రభాస్‌ అని టైటిల్స్ లో పడేది. కానీ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో రెబల్ స్టార్ ప్రభాస్‌ అని కాకుండా.. ‘శ్రీ’ ప్రభాస్ అని వేశారు. ఇక ప్రభాస్ నటించబోవు సినిమాల్లో రెబల్ స్టార్ ప్రభాస్‌ కాకుండా.. శ్రీ ప్రభాస్ అని పడనుంది. ప్రభాస్‌ను అతడి ఫ్యాన్స్ ముద్దుగా డార్లింగ్ అని పిలుస్తారన్న విషయం తెలిసిందే. ఇటీవలే సలార్‌తో భారీ హిట్ కొట్టిన ప్రభాస్‌ కల్కి సినిమాతో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నట్లే.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here