Dunki Movie : హాలీవుడ్ లో ప్రభాస్ అరాచకం.. మరి షారుక్ డంకీ పరిస్థితేంటి..!

- Advertisement -

Dunki Movie : ‘సలార్’, ‘డంకీ’ చిత్రాలు ఇండియన్ బాక్సాఫీస్ తో పాటు గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర కూడా దుమ్ము రేపుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో మంచి వసూళ్లను రాబడుతున్నాయి. అంతేకాదు, గ్లోబల్ బ్లాక్సాఫీస్ దగ్గర టాప్ 5లో చోటు దక్కించుకున్నాయి. ‘సలార్’ మూడో స్థానంలో నిలవగా, ‘డంకీ’ నాలుగో స్థానాన్ని పొందింది. తాజా అంతర్జాతీయ నివేదికల ప్రకారం ‘సలార్’, ‘డంకీ’ సినిమాలు గ్లోబల్ బాక్సాఫీస్ ను శాసిస్తున్నాయి.

‘‘బాహుబలి’ స్టార్ ప్రభాస్ హీరోగా ‘కేజీఎఫ్’ సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ మూవీ ‘సలార్ పార్ట్ 1’ గ్లోబల్ మార్కెట్ లో సత్తా చాటుతోంది. ఈ చిత్రం ఏకంగా 39 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో సుమారు రూ.324 కోట్ల) వసూళ్లతో మూడవ స్థానంలో నిలిచింది” అని తాజా నివేదిక వెల్లడించింది. ఇక బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ కాంబోలో వచ్చిన ‘డంకీ’ మూవీ సైతం గ్లోబల్ మార్కెట్ లో మంచి వసూళ్లను సాధిస్తోంది.

‘‘బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, హిట్ మేకర్ రాజ్ కుమార్ హిరానీ ఇమ్మిగ్రేషన్ డ్రామా కామెడీ ‘డంకీ’ 22.9 మిలియన్ డాలర్ల(భారత కరెన్సీలో రూ.190 కోట్ల) వసూళ్లతో నాల్గవ స్థానంలో ఉంది” అని అదే నివేదిక తెలిపింది. ‘సలార్’ భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా అద్భుత వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ చిత్రం మూడు రోజుల్లో రూ.402 కోట్లు వసూలు చేసినట్లు ‘సలార్’ టీమ్ వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ ను విడుదల చేసింది. “రికార్డ్ బ్రేకింగ్ బ్లాక్‌బస్టర్. మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 402 కోట్లు వసూలు చేసింది” అని రాసుకొచ్చింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here