Salaar Trailer : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘సలార్’ చిత్రం కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఎప్పుడో సెప్టెంబర్ నెలలో విడుదల అవ్వాల్సిన ఈ సినిమాని కొన్ని అనుకోని కారణాల వల్ల డిసెంబర్ 22 కి వాయిదా వేశారు. మరో నాలుగు రోజుల్లో విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ గత కొద్దీ రోజుల క్రితం విడుదలై నెగటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది.

సినిమా హైప్ కి తగ్గట్టుగా ట్రైలర్ లేదు వంటి కామెంట్స్ బాగా వినిపించాయి. కానీ ఈరోజు కాసేపటి క్రితమే విడుదలైన రిలీజ్ ట్రైలర్ ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ కి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. ప్రతీ షాట్ లోను అద్భుతమైన డిటైలింగ్ తో పాటుగా యాక్షన్ సన్నివేశాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో వచ్చాయని ఈ ట్రైలర్ ని చూస్తే అర్థం అయిపోతుంది.

కాన్సర్ నగరం ఎంతో మంది తల రాతలను మార్చింది, కానీ కాన్సర్ తల రాతని మార్చింది మాత్రం ఇద్దరు ప్రాణ స్నేహితులు భద్ర శత్రువులుగా మారడం అంటూ సినిమా స్టోరీ లైన్ ని ఒక్క ముక్కలో చెప్పేసాడు డైరెక్టర్. ట్రైలర్ లోని ప్రతీ డైలాగ్ లో ప్రశాంత్ నీల్ మార్క్ కనిపించింది. ఇక యాక్షన్ సన్నివేశాలు అయితే ఇండియన్ ఫిలిం మేకర్స్ కి ఒక సరికొత్త బెంచ్ మార్క్ పెట్టేలా అనిపిస్తున్నాయి.

కేజీఎఫ్ చిత్రం లో ఉన్న యాక్షన్ సన్నివేశాలు మరియు ఎలివేషన్స్ సలార్ ముందు ఒక మూలకి కూడా సరిపోవు అని అనిపిస్తుంది. రిలీజ్ ట్రైలర్ లో చూపించిన విధంగానే సినిమా ఔట్పుట్ కూడా ఉంటే మాత్రం వెయ్యి కోట్ల రూపాయిలు కాదు, ఏకంగా బాహుబలి 2 కలెక్షన్స్ ని దాటి రెండు వేల కోట్ల రూపాయిలను వసూలు చేస్తుందని అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.