Salaar : సామాన్యులకు అందుబాటులో లేని విధంగా ‘సలార్’ మూవీ టికెట్ రేట్లు.. ఇంత అత్యాశ అవసరమా!

- Advertisement -

Salaar : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటిస్తున్న ‘సలార్’ చిత్రం కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటుగా టాలీవుడ్, బాలీవుడ్ మరియు శాండిల్ వుడ్ ఇలా అన్నీ భాషలకు సంబంధించిన ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ముందు ఎంత పెద్ద సూపర్ స్టార్ ఎదురొచ్చిన తగ్గాల్సిందే, ఆ మేనియా లో కొట్టుకుపోయారు అంటూ ట్రేడ్ పండితులు సైతం చెప్పుకొస్తున్నారు.

Salaar
Salaar

డిసెంబర్ 22 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతీయ భాషల్లో విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ డిసెంబర్ 1 వ తేదీన విడుదల చెయ్యబోతున్నారు. ఈ ట్రైలర్ తో ఈ చిత్రం మీద ఉన్న అంచనాలు పదింతలు అవుతాయని అంటున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ అన్నీ ప్రాంతాలలో #RRR రేంజ్ లో జరిగిన సంగతి మన అందరికీ తెలిసిందే.

Prabhas

ముఖ్యంగా నైజాం ప్రాంతం లో 65 కోట్ల రూపాయలకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే దాదాపుగా #RRR మూవీ రేంజ్ లో అన్నమాట. మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాంతం లో హక్కులను కొనుగోలు చేసింది. అయితే హైదరాబాద్ నుండి తెలంగాణ అన్నీ ప్రాంతాలకు కలిపి సలార్ చిత్రానికి మల్టీప్లెక్స్ థియేటర్స్ లో 410 రూపాయిలు , సింగల్ స్క్రీన్ థియేటర్స్ లో 250 రూపాయిల టికెట్ రేట్స్ ని పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

- Advertisement -

సినిమాకి టాక్ వస్తే పర్వాలేదు, ఒకవేళ టాక్ రాకపోతే మాత్రం నష్టం ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉంటుంది. ఈ చిత్రం క్రేజ్ వేరే లెవెల్ లో ఉంది కాబట్టి టాక్ తో సంబంధం లేకుండా వీకెండ్ వరకు హౌస్ ఫుల్స్ పడుతాయి. అందుకే టికెట్ రేట్స్ భారీ గా పెంచి వీకెండ్ లోపు బ్రేక్ ఈవెన్ కి దగ్గరగా వెళ్లే ఆలోచనలో ఉన్నారంట మేకర్స్. మరి ఆడియన్స్ ఆ రేంజ్ వసూళ్లను ఇస్తారో లేదో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here