Prabhas : ఆ హీరోయిన్ తో మాల్దీవుల్లో ఎంజాయ్ చెయ్యనున్న ప్రభాస్..అక్కడే అది కూడా..

- Advertisement -

Prabhas : పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ పేరు ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతోంది..ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరూ పెళ్ళి చేసుకున్నారు..కానీ ప్రభాస్ పెళ్ళి ఎప్పుడూ చేసుకుంటారు..ఎలాంటి అమ్మాయిని చేసుకుంటారని అభిమానులు, తోటి సినీ తారలు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. అసలే ప్రభాస్ వయసు 43కు చేరువైంది. కెరీర్ పరంగా యమా జోరు చూపిస్తున్న ప్రభాస్.. పెళ్లి ఊసు మాత్రం ఎత్తడం లేదు. గతంలో అనుష్క శెట్టితో ప్రభాస్ పెళ్లి ఖాయమంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అభిమానులు కూడా ఈ జంట పెళ్లి చేసుకుంటే చూడాలని ఎంతగానో ఆరాట పడ్డారు.

Prabhas
Prabhas

ఆ వార్తల పై వారు స్పందించి మేము కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అని తేల్చి చెప్పేశారు.ఇప్పటికే ఎన్నోసార్లు స్పష్టం చేశారు. ఇక ఇటీవల బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్‌తో ప్రభాస్ ప్రేమలో పడ్డారని.. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని జోరుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు నిజం కాదంటూ కృతి సనన్ అప్పుడే పులిస్టాప్ పెట్టింది. కానీ తాజాగా మరోసారి ఈ వార్తలు తెరపైకి వచ్చాయి…వారిద్దరు నిజంగా ప్రేమలో వున్నారు అంటూ ఇప్పటికే వార్తలు వస్తూనే ఉన్నాయి..ఈ విషయం పై రీసెంట్‌గా కృతి స్పందించింది బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పింది..అయినా కూడా ఇండస్ట్రీ లో గుసుగుసలు ఆగలేదు..

Prabhas and Kriti Sanon
Prabhas and Kriti Sanon

ఇప్పుడు మరోసారి వీరి ప్రేమ నిజం అంటూ ప్రచారం జరుగుతుంది.ప్రభాస్ తన ప్రేమను ప్రపోజ్ చేయడం కోసం రెడీ అవుతున్నాడని.. న్యూ ఇయర్ కు ఒక రోజు ముందు అంటే డిసెంబర్ 31న మల్దీవ్స్ వేదికగా ఆయన తన ప్రేమను వ్యక్తపరచబోతున్నాడని సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది..అక్కడే వాళ్ళు న్యూయర్ ను కూడా సెలెబ్రేట్ చేసుకోనున్నారని తెలుస్తుంది.

- Advertisement -
movie shotting
movie shotting

ఈ ప్రచారం ఎంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది. కాగా ప్రభాస్-కృతి సనన్‌ జంటగా ఆదిపురుష్‌ సినిమాలో నటించారు. ప్రస్తుతం ఇది షూటింగ్ జరుపుకుంటుంది.. వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల కానుంది. రామాయణం ఇతిహాస గాథ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో ఈ మూవీని రూపొందించారు. ఇక ఈ సినిమాతో పాటు ప్రభాస్ ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో సలార్‌, నాగ్ అశ్విన్ తో ప్రాజెక్ట్ కె, మారుతితో రాజా డీలక్స్ చిత్రాలు చేస్తున్నాడు. వీటితో పాటు సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ అనే మూవీని చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.. ఇక సుకుమార్ తో కూడా ఓ చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here