Trisha : చెన్నై చంద్రం త్రిషకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో వర్షం సినిమాతో పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమాతోనే సాలిడ్ సక్సెస్ అందుకున్న త్రిషకు ఇక్కడ భారీ ఫాలోయింగ్ పెరిగింది. తెలుగు, తమిళ భాషల్లో అగ్ర కథానాయికగా ఇప్పటికీ వరుస సినిమాలతో సందడి చేస్తున్న నటి త్రిష. వయసు పెరుగుతున్న కొద్దీ తరగని అందంతో యువతను మంత్రముగ్ధులను చేస్తోంది. ఆమె కీలక పాత్రలో నటించిన ‘పొన్నియిన్ సెల్వన్-2’ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమైంది.

ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన త్రిష ఆసక్తికర అంశాన్ని చెప్పింది. వర్షం సినిమాలో ప్రభాస్ కు జంటగా త్రిష నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే. త్రిష కెరీర్‌ను మలుపుతిప్పిన చిత్రం ‘వర్షం’ (Varsham). ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కిన ఆ సినిమాలో శైలజ అలియాస్ శైలు పాత్రలో కనిపించి మాయ చేశారామె. తండ్రి మాటకు ఎదురుచెప్పలేక ఇష్టంలేకపోయినా సినిమాల్లో నటించే మిడిల్ క్లాస్ అమ్మాయిగా ఆమె ఒదిగిపోయారు.
ఆనందమైనా, బాధనైనా శైలు వర్షంతో పంచుకునే సన్నివేశాలు ప్రేక్షకుల మదిలో నిలిచాయి. వర్షంతో మాటలేకాదు ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ అంటూ పాట పాడి మురిపించారామె. వర్షం వచ్చినప్పుడల్లా సినీ ప్రియులంతా ఆ పాటను, శైలజ పాత్రను గుర్తుచేసుకుంటుంటారంటే అతిశయోక్తి కాదేమో! అలాగే త్రిషకు కూడా వర్షంపడినప్పుడల్లా ఆ సినిమానే గుర్తొస్తుందిట. ఇక త్రిష ఈ సినిమాలో నటించినందుకు తెలుగు ప్రేక్షకుల ప్రశంసలతోపాటు ఉత్తమ నటిగా ‘ఫిల్మ్‌ఫేర్’ అవార్డు అందుకున్నారు.

ఇక మరోవైపు ప్రభాస్ ఫ్యాన్స్ ఆమె అందాన్ని పొడగ్తలతో ముంచేస్తున్నారు. వర్షం లో ప్రభాస్ చెప్పిన డైలాగును ట్రెండ్ చేస్తున్నారు. “ఐశ్వర్య రాయి కన్నా నువ్వే బాగున్నావు .. నీ ముందు ఆమె వేస్ట్ అనేలా ఓ డైలాగ్ చెప్పుకొస్తాడు . ఈ క్రమంలోనే రీసెంట్గా పోనియన్ సెల్వన్ 2 సినిమా ప్రమోషన్స్ లో పక్కపక్కనే ఐశ్వర్య – త్రిష నిలుచున ఫోటో ని మ్యాచ్ చేస్తూ ఆనాడు ప్రభాస్ చెప్పింది నిజమైంది . ఒకసారి ఈ ఫొటోస్ చూడండి ఐశ్వర్య రాయ్ – త్రిషలల్లో కంపేర్ చేస్తే ఎవరు బాగున్నారు ..? ఎవరు అందంగా ఉన్నారు..? అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఆ పిక్ ను ట్రెండ్ చేస్తున్నారు.