Trisha Krishnan : మరోసారి సొగసుల బాంబ్ విసిరిన త్రిష.. చెన్నై బ్యూటీ క్యూట్ స్మైల్​కు కుర్రాళ్లు ఫిదా

- Advertisement -

Trisha Krishnan గతేడాది విడుదలైన ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 1’ కు కొనసాగింపుగా రూపొందిన ‘పీఎస్‌ 2’ ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఈ చిత్రబృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసింది. ఈ వేడుకకు విజయేంద్ర ప్రసాద్‌ ముఖ్య అతిథిగా హాజరై, బిగ్‌ టికెట్‌ ఆవిష్కరించారు. ఈ ఈవెంట్​లో కార్తి, విక్రమ్, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష, శోభిత, ఐశ్వర్య లక్ష్మి పాల్గొని సందడి చేశారు. ముద్దుగుమ్మలు త్రిష, ఐశ్వర్యారాయ్ రాయల్ లుక్​లో సందడి చేశారు.

Trisha Krishnan
Trisha Krishnan

ముఖ్యంగా పీఎస్2 ఈవెంట్​లో త్రిష రాయల్ లుక్​లో మహారాణిలా కనిపించింది. బ్లాక్ కలర్ శారీలో తన సొగసుతో వలపు బాణం విసిరింది. త్రిష, శారీ డెడ్లీ కాంబినేషన్ అన్న విషయం తెలిసిందే. అందులోనూ బ్లాక్ కలర్. ఇక ఈ చీరలో త్రిష అందం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బ్లాక్ శారీలో స్లీవ్ లెస్ బ్లౌజుల్ మెడలో డైమండ్ నెక్లెస్​తో సింపుల్ బట్ ఎలిగెంట్​గా త్రిష లుక్ అదిరిపోయింది.

Trisha

ప్రస్తుతం త్రిష లేటెస్ట్ ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఈ బ్యూటీ అందాన్ని చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. తన క్యూట్​నెస్​తో ఈ చెన్నై చిన్నది కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొడుతోంది. త్రిష ఫొటోలు చూసిన కుర్రాళ్లు.. చెన్నై చంద్రమా.. మనసే చే జారే అంటూ పాటలు పాడుకుంటున్నారు. మరికొందరేమో ఆ కాటుక కళ్లు చూసి.. నల్లానల్లాని కళ్ల పిల్లా.. అంటూ హమ్ చేస్తున్నారు. వయసు పెరుగుతున్న కొద్ది ఈ భామ అందం మరింత పెరుగుతోందని కుర్రాళ్లు కామెంట్లు చేస్తున్నారు. త్రిష.. నీ బ్యూటీ సీక్రెట్ ఏంటి అంటూ అమ్మాయిలు అడుగుతున్నారు.

- Advertisement -
Krishnan

ఈ ఈవెంట్​లో త్రిష తన క్యూట్ మాటలతో హైదరాబాద్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘‘హైదరాబాద్‌ ఎప్పుడూ నా హోమ్‌టౌన్‌లానే అనిపిస్తుంది. ‘పీఎస్‌ 1’లో పాత్రల పరిచయం, కొన్ని పాటలు చూశారు. ‘పీఎస్‌ 2’లో అసలు కథ మొదలవుతుంది. తప్పకుండా థియేటర్‌కు వెళ్లి ఈ చిత్రాన్ని చూడండి. మమ్మల్ని ఆదరించండి’’ అని ఈ చెన్నై బ్యూటీ తన క్యూట్ క్యూట్ స్పీచ్​తో ఫ్యాన్స్​ను అలరించింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here