Catherine Tresa : పొట్టిదుస్తుల్లో అల్లు అర్జున్ బ్యూటీ గ్లామర్ ట్రీట్

- Advertisement -

Catherine Tresa : ‘వయ్యారి భామ.. నీ హంస నడక.. ఎందుకే తొందర తొందర’.. అదేంటి పవన్ కల్యాణ్ పాట పాడుతున్నా అనుకుంటున్నారా. ఎందుకంటే టాలీవుడ్ బ్యూటీ కేథరిన్ థెరిస్సా తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసిన ఫొటోలు చూస్తే మీరు కూడా ఈ పాటే పాడుకుంటారు. ఎందుకంటే ఈ బ్యూటీ తన స్టైలిష్ నడకతో మిమ్మల్ని మెస్మరైజ్ చేయక మానదు. లేటెస్ట్​గా కేథరిన్ పోస్టు చేసిన ఫొటోల్లో సూపర్ స్టైలిష్​గా నడుస్తూ కేథరిన్ అభిమానులను ఫిదా చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నారు.

Catherine Tresa
Catherine Tresa

కేథరిన్ థెరిస్సా.. తన ఫొటోలతో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. స్కిన్ కలర్ ఔట్​ఫిట్​లో ఓవైపు క్యూట్​ పోజులిస్తూనే.. మరోవైపు హాట్ ట్రీట్​తో సందడి చేసింది. కేథరిన్ ఫొటోలు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఈ భామ అందానికి మెస్మరైజ్ అవుతున్నారు. కేథరిన్ అందం, అభినయం రెండూ కలబోసిన క్యూటీ అంటూ తెగ ప్రేమను కురిపించేస్తున్నారు. ఇద్దరమ్మాయిలతో సినిమాలో ఈ భామ క్యూట్​నెస్​ని ఇంకా మరిచిపోలేకపోతున్నామంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Catherine Tresa Photos

కేథరిన్ టాలీవుడ్​లో ఇద్దరమ్మాయిలతో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్​లో బిజీ అయిపోయింది. సూపర్ హిట్ సినిమాల్లో నటించి అనతికాలంలోనే స్టార్​డమ్ సొంతం చేసుకుంది. కానీ ఆ తర్వాత ఈ బ్యూటీ కెరీర్ కాస్త స్లోగా నడిచింది. తమిళ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడంతో.. టాలీవుడ్​లో అవకాశాలు కాస్త నెమ్మదించాయి. ఇక ఇటీవల మళ్లీ తెలుగు తెరపై కమ్​బ్యాక్ ఇచ్చింది. కానీ తెలుగులో ఎక్కువగా సెకండ్ లీడ్​లోనే కనిపిస్తోంది.

- Advertisement -
Catherine Tresa Stills

కేథరిన్ ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళ ఇండస్ట్రీలో పలు సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. ఈ మధ్య తెలుగు సినిమాల్లో కాస్త తక్కువగా కనిపిస్తోంది. గతేడాది భళా తందనాన సినిమాలో నటించి అలరించింది. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజకు భార్యగా నటించి కేథరిన్ ఎట్టకేలకు ఓ హిట్​ను తన ఖాతాలో వేసుకుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here