Project K : అమెరికాలో ‘ప్రాజెక్ట్-కె’ క్రేజ్.. ప్రభాస్ కోసం US ఫ్యాన్స్ చేసిన పని చూస్తే వావ్ అంటారు

- Advertisement -

Project K : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్​ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ డార్లింగ్ హీరో కూడా అభిమానులకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంటాడు. యూత్​లో రెబల్ స్టార్​కు మామూలు క్రేజ్​ లేదు. బాహుబలి ముందు వరకు కొంతవరకే పరిమితమైన ప్రభాస్ ఫ్యాన్​డమ్.. ఆ సినిమా తర్వాత ప్రపంచ వ్యాప్తమైంది. ఇండియాలోనే కాకుండా విదేశాల్లోనూ డార్లింగ్ హవా నడుస్తోంది. సినిమా ఇండస్ట్రీలో జీరో కాంట్రవర్సీలతో.. జీరో హేట్రెడ్ ఉన్న హీరోల్లో ప్రభాస్ ఉన్నాడు. ఇక బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్​గా మారిన ప్రభాస్.. తన పాన్ ఇండియన్ ఫ్యాన్స్ కోసం సినిమాలు చేస్తున్నారు. అందుకే తన నుంచి ఏ సినిమా వచ్చిన అది పాన్ ఇండియా భాషల్లో తెరకెక్కుతోంది.

Project K
Project K

ప్రస్తుతం ప్రభాస్ చేతి నిండా సినిమాలతో సూపర్ బిజీగా ఉన్నాడు. ఇటీవలే ఆదిపురుష్ సినిమాతో థియేటర్లలో సందడి చేశాడు. ఇక ఇప్పుడు ఓవైపు ప్రాజెక్ట్-K మరోవైపు సలార్ సినిమా షూటింగులతో తీరిక లేకుండా ఉన్నాడు. ముఖ్యంగా ప్రాజెక్ట్-K మూవీపై ప్రభాస్ ప్రస్తుతం తన ఫోకస్ ఎక్కువగా పెట్టాడు. భారీ బడ్జెట్​తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లీడ్​ రోల్ చేస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్​ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాను మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు. నాగ్ అశ్విన్-ప్రభాస్ కాంబో ఎలా ఉండబోతోందో అని అభిమానులు ఆసక్తిగా ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ క్రమంలో సినిమా కంటే ముందు నుంచే మూవీ టీమ్​ ఓ వైపు షూటింగ్​తో పాటు సినిమా ప్రమోషన్ల విషయంలో జోరు చూపిస్తోంది.

ఇటీవలే ‘ప్రాజెక్ట్-K’ టైటిల్‌ను అమెరికాలోని లోని శాన్ డియాగో కామిక్​ కాన్ అనే​ పేరిట జరిగే ఈవెంట్​లో ఆవిష్కరిస్తున్నట్లు మేకర్స్​ ప్రకటించారు. జులై 20న జరిగే ఈ వేడుక కోసం కమల్​హాసన్, ప్రభాస్ , దీపికా పదుకొనే, డైరెక్టర్ నాగ్ అశ్విన్ అమెరికాకు హాజరవ్వనున్నారు. ఇక ప్రభాస్​ ఆల్రెడీ అమెరికాకు వెళ్లిపోయాడు. ప్రభాస్ వచ్చాడని తెలుసుకున్న యూఎస్ ఫ్యాన్స్ ఆయన కోసం ఓ సూపర్ సర్​ప్రైజ్​ను ప్లాన్ చేశారు. అదేంటంటే..?

- Advertisement -
Project k USA Fans

యూఎస్​ మిస్సోరిలోని సెయింట్ లూయిస్​కు చెందిన ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఓ చోటుకు చేరుకున్నారు. ప్రాజెక్ట్-K టీ షర్ట్స్ ధరించి రోడ్లపై భారీ కార్ ర్యాలీని నిర్వహించారు. అంతే కాకుండా ప్రాజెక్ట్-K లోగోను కార్లతో ఆవిష్కరించారు. దీనికి సంబంధించిన వీడియోను వైజయంతి మూవీస్ బ్యానర్​ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీన్ని చూసిన ఫ్యాన్స్​ సంతోషంతో సంబురాలు సుకుంటున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ‘ప్రాజెక్ట్ కె’ సినిమా విషయానికి వస్తే.. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్వినీదత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సైన్స్​ ఫిక్షన్​ మూవీలో దీపికా పదుకుణె, అమితాబ్​ బచ్చన్​, కమల్​ హాసన్, దిశా పటానీ లాంటి భారీ తారాగణం నటిస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here