Project K : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ డార్లింగ్ హీరో కూడా అభిమానులకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంటాడు. యూత్‌లో రెబల్ స్టార్‌కు మామూలు క్రేజ్ లేదు. బాహుబలి ముందు వరకు కొంతవరకే పరిమితమైన ప్రభాస్ ఫ్యాన్డమ్.. ఆ సినిమా తర్వాత ప్రపంచ వ్యాప్తమైంది. ఇండియాలోనే కాకుండా విదేశాల్లోనూ డార్లింగ్ హవా నడుస్తోంది. సినిమా ఇండస్ట్రీలో జీరో కాంట్రవర్సీలతో.. జీరో హేట్రెడ్ ఉన్న హీరోల్లో ప్రభాస్ ఉన్నాడు. ఇక బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్.. తన పాన్ ఇండియన్ ఫ్యాన్స్ కోసం సినిమాలు చేస్తున్నారు. అందుకే తన నుంచి ఏ సినిమా వచ్చిన అది పాన్ ఇండియా భాషల్లో తెరకెక్కుతోంది.

ప్రస్తుతం ప్రభాస్ చేతి నిండా సినిమాలతో సూపర్ బిజీగా ఉన్నాడు. ఇటీవలే ఆదిపురుష్ సినిమాతో థియేటర్లలో సందడి చేశాడు. ఇక ఇప్పుడు ఓవైపు ప్రాజెక్ట్-K మరోవైపు సలార్ సినిమా షూటింగులతో తీరిక లేకుండా ఉన్నాడు. ముఖ్యంగా ప్రాజెక్ట్-K మూవీపై ప్రభాస్ ప్రస్తుతం తన ఫోకస్ ఎక్కువగా పెట్టాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాను మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు. నాగ్ అశ్విన్-ప్రభాస్ కాంబో ఎలా ఉండబోతోందో అని అభిమానులు ఆసక్తిగా ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ క్రమంలో సినిమా కంటే ముందు నుంచే మూవీ టీమ్ ఓ వైపు షూటింగ్‌తో పాటు సినిమా ప్రమోషన్ల విషయంలో జోరు చూపిస్తోంది.
ఇటీవలే ‘ప్రాజెక్ట్-K’ టైటిల్‌ను అమెరికాలోని లోని శాన్ డియాగో కామిక్ కాన్ అనే పేరిట జరిగే ఈవెంట్లో ఆవిష్కరిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. జులై 20న జరిగే ఈ వేడుక కోసం కమల్‌హాసన్, ప్రభాస్ , దీపికా పదుకొనే, డైరెక్టర్ నాగ్ అశ్విన్ అమెరికాకు హాజరవ్వనున్నారు. ఇక ప్రభాస్ ఆల్రెడీ అమెరికాకు వెళ్లిపోయాడు. ప్రభాస్ వచ్చాడని తెలుసుకున్న యూఎస్ ఫ్యాన్స్ ఆయన కోసం ఓ సూపర్ సర్ప్రైజ్ను ప్లాన్ చేశారు. అదేంటంటే..?

యూఎస్ మిస్సోరిలోని సెయింట్ లూయిస్‌కు చెందిన ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఓ చోటుకు చేరుకున్నారు. ప్రాజెక్ట్-K టీ షర్ట్స్ ధరించి రోడ్లపై భారీ కార్ ర్యాలీని నిర్వహించారు. అంతే కాకుండా ప్రాజెక్ట్-K లోగోను కార్లతో ఆవిష్కరించారు. దీనికి సంబంధించిన వీడియోను వైజయంతి మూవీస్ బ్యానర్ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీన్ని చూసిన ఫ్యాన్స్ సంతోషంతో సంబురాలు సుకుంటున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ‘ప్రాజెక్ట్ కె’ సినిమా విషయానికి వస్తే.. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్వినీదత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో దీపికా పదుకుణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ లాంటి భారీ తారాగణం నటిస్తున్నారు.