Kriti Sanon : షైనింగ్ ఔట్​ఫిట్​లో ప్రభాస్ గర్ల్​ఫ్రెండ్ స్టన్నింగ్ లుక్స్

- Advertisement -

Kriti Sanon : ఆవ్ తుజో మోగ్ కోర్తా (ఐ లవ్ యూ) అంటూ తెలుగు కుర్రాళ్లను మాయ చేసింది బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్. వన్.. నేనొక్కడినే సినిమాతో టాలీవుడ్​లో అరంగేట్రం చేసిన ఫస్ట్ సినిమాతోనే సూపర్ స్టార్ మహేశ్ బాబుతో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఆ తర్వాత నాగచైతన్యతో కలిసి దోచెయ్ మూవీలో కనిపించింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఈ భామ తిరిగి ముంబయికి వెళ్లింది.

Kriti Sanon
Kriti Sanon

బాలీవుడ్​లో వరుస సినిమాలు చేస్తూ కృతి తన సత్తా చాటుతోంది. అక్షయ్ కుమార్ వంటి సీనియర్ స్టార్స్​తో ఓవైపు.. వరుణ్ ధావన్, టైగర్ ష్రాఫ్, కార్తీక్ ఆర్యన్ వంటి యంగ్ హీరోలతో మరోవైపు జత కడుతోంది. సినిమాలు హిట్టు ఫ్లాప్​లతో సంబంధం లేకుండా ఈ బ్యూటీకి వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్​లో స్టార్ హీరోయిన్​.

Kriti Sanon photos
Kriti Sanon

ఇక కృతి సోషల్ మీడియాలో చేసే సందడి అంతా ఇంతా కాదు. తరచూ తన ఫొటోషూట్​కు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా కృతి మెరున్ కలర్ షైనింగ్ డ్రెస్సులో సందడి చేసింది. ఈ డ్రెస్​లో థైస్ దగ్గర కట్​ కృతి గ్లామర్​ను మరింత ఎలివేట్ చేసింది. చేతికి రింగులు పెట్టుకుని సింపుల్​ లుక్​లోనూ ఈ బ్యూటీ సూపర్ ఎలిగెంట్​గా కనిపించింది.

- Advertisement -
Kriti Sanon Latest Photos
Kriti Sanon

ఈ ఫొటోలు కాస్త నెట్టింట పోస్టు చేయడంతో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోషూట్​లో కృతి ఘాటు పోజులు చూసి కుర్రాళ్లు టెంప్ట్ అవుతున్నారు. నడుం అందాలు చూస్తూ మైమరిచిపోతున్నారు. ఇక థైస్​ షోతో కృతి మతి పోగొడుతోందని కుర్రాళ్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ అందం చూడ్డానికే కదా మేం సోషల్ మీడియాలో ఉంది అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Kriti Sanon Images
Kriti Sanon

ప్రస్తుతం కృతి సనన్ సినిమాల విషయానికి వస్తే ఈ బ్యూటీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస సరసన ఆదిపురుష్ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీలో కృతి సనన్ సీత పాత్రలో మెరవనుంది. ఇక ప్రభాస్​తో ఈ బ్యూటీ రిలేషన్​షిప్​లో ఉన్నట్లు పుకార్లు వస్తున్నాయి. అయితే ఈ ఇద్దరూ ఈ రూమర్స్​ను కొట్టిపడేసినా.. ఫ్యాన్స్ మాత్రం వీళ్ల జంట బాగుంటుందంటూ తెగ పోస్టులు చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here