Pooja Hegde : బక్కచిక్కిన బుట్టబొమ్మ.. అయినా భలే ఉంది..!

- Advertisement -

బుట్టబొమ్మ Pooja Hegde ఈ మధ్య కాలంలో మరీ బక్కపడినట్లుగా కనిపిస్తోంది. ఇక రీసెంట్​గా ఈ భామ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫొటోలు చూస్తుంటే నిజంగానే సన్నబడినట్లు తెలుస్తోంది. అయినా ఈ బ్యూటీ గ్లామర్ మాత్రం ఏం తగ్గలేదు. మరింత అందంతో కుర్రాళ్లను కవ్విస్తోంది పూజా హెగ్డే.

Pooja Hegde
Pooja Hegde

తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలు షేర్ చేసింది. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు బుట్టబొమ్మ బక్కబడినా.. భలే అందంగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫొటో షూట్​లో పూజా హెగ్డే.. తన నడుము అందాలు చూపిస్తూ కుర్రాళ్లను మాయ చేసేస్తోంది. ఒళ్లు విరుపు పోజులతో ఆకట్టుకుంటోంది. కొందరు బొద్దుగా ఉంటే ముద్దొస్తారు.. ఇంకొందరు స్లిమ్​గా ఉంటే సూపర్ ఉంటారు.. కానీ మా బుట్టబొమ్మ ఎలా ఉన్నా అందంగా ఉంటుంది అంటూ నెటిజన్లు మురిసిపోతున్నారు.

Pooja Hegde  Photos

తాజాగా బాలీవుడ్ మూవీ సర్కస్ ప్రమోషన్స్​లో బిజీగా ఉంది పూజా హెగ్డే. ఈ సినిమాలో రణ్​వీర్ సింగ్ సరసన హీరోయిన్​గా నటిస్తోంది. ఈ బ్యూటీకి ఈ ఏడాది ఏం కలిసి రాకపోయినా.. ఆఫర్లు మాత్రం బాగానే వచ్చాయి. హిట్​, ఫ్లాప్​లతో సంబంధం లేకుండూ పూజ సినిమాలు చేస్తూ దూసుకెళ్తూనే ఉంది.

- Advertisement -
Pooja Hegde  Images

ఇక ఈ అమ్మడు టాలీవుడ్​లో మహేశ్​ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. పూజా భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందట. తనకు మార్కెట్​లో బాగా ఫాలోయింగ్ ఉండటంతో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ఫార్ములా పాటిస్తోందట. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ తన ఫోకస్ అంతా బాలీవుడ్​పైనే పెట్టినట్లు తెలుస్తోంది.

Pooja Hegde  Pics

పూజా హెగ్డే నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత వరుణ్ హీరోగా పరిచయమైన ‘ముకుందా’ సినిమాలో గోపికమ్మ పాటతో ఈ భామ క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం అగ్ర హీరోల బెస్ట్ ఆప్షన్‌గా నిలిచిన పూజా హెగ్డే త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అల వైకుంఠపురములో’ సినిమాతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇలా వరుస అవకాశాలతో దూసుకెళ్తూ టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్​లలో తన సత్తా చాటుతోంది పూజ.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here