Darshan : కన్నడ స్టార్​కు చేదు అనుభవం.. ఆ హీరోను చెప్పుతో కొట్టిన ఫ్యాన్

- Advertisement -

Darshan : కొందరు కాస్త సెలబ్రిటీ హోదా రాగానే ఏది పడితే అది మాట్లాడేస్తుంటారు. తామేం మాట్లాడినా చెల్లుతుందని భావిస్తుంటారు. ఒళ్లు మరిచి.. స్థాయి మరచి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. మరికొందరైతే ఫేమస్ కావడానికి కావాలనే ఇలా వివాదాల్లో చిక్కుకుంటారు. అయితే అన్నిసార్లు ఒకేలా ఉండవు. సెలబ్రిటీలం కదా ఏం మాట్లాడినా చెల్లుతుందని అనుకోకూడదు.. ఏం అవుతుందిలే అని నోటికొచ్చినట్టు మాట్లాడితే అప్పుడప్పుడు ఊహించని రియాక్షన్ చూడాల్సి ఉంటుంది. అచ్చం ఇలాంటి పరిస్థితే ఎదురైంది కన్నడ హీరో దర్శన్​కు.

కన్నడ హీరో దర్శన్ తన ప్రస్తుత సినిమా ‘క్రాంతి’ని ప్రమోట్ చేసుకునే హడావిడిలో ఉన్నాడు. ఈ సినిమా జనవరి 26న గ్రాండ్ రిలీజ్​కు రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే ఆయనపై ఓ వ్యక్తి చెప్పుతో దాడి చేశాడు. డిసెంబర్ 18 ఆదివారం కర్ణాటకలోని హోసపేటలో జరిగిన ఓ ప్రమోషన్ ఈవెంట్​లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

ఆ ఈవెంట్​కు వచ్చిన ఓ వ్యక్తి దర్శన్‌పై తన చెప్పు విసిరాడు. ‘క్రాంతి’ మూవీలోని ఓ పాటను రిలీజ్ చేస్తున్న క్రమంలో ఈ సినిమాలో నటించిన నటి రచితా రామ్ మాట్లాడుతోంది. అదే సమయంలో పక్కనే ఉన్న దర్శన్​పై ఆ వ్యక్తి చెప్పు విసిరాడు. అది నేరుగా వెళ్లి దర్శన్ భుజాలకు తగిలింది. వెంటనే స్పందించిన దర్శన్.. ప్రశాంతంగా ఉండాలని..ఇందులో అతని తప్పులేదంటూ.. వాతావరణం సద్దుమణిగేలా ప్రయత్నించాడు.

- Advertisement -

దర్శన్​పై చెప్పు దాడి గురించి తెలుసుకున్న కన్నడ సూపర్ స్టార్ శివరాజ్​ కుమార్ వెంటనే స్పందించారు. ఓ వీడియో సందేశాన్ని విడుదల చేసి, చర్యను ఖండించారు. ఇలాంటి చర్యలకు ప్రజలు దూరంగా ఉండాలని కోరారు. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్​తో పాటు ధన్వీర, రాజవర్ధన్‌ లాంటి పలువురు స్టార్లు సోషల్ మీడియా ద్వారా దర్శన్​పై దాడిని ఖండించారు.

ఈ చెప్పు దాడికి గల కారణం ఇటీవల దర్శన చేసిన వ్యాఖ్యలేనని కన్నడ మీడియా కోడై కూస్తోంది. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఛాలెంజింగ్ స్టార్ అని ముద్దుగా పిలుచుకునే నటుడు దర్శన్. ఇటీవల ఆయన అదృష్ట దేవతపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. బహుశా అదృష్ట దేవతపై ఆయన చేసిన వ్యాఖ్య వల్ల ఈ దాడి జరిగి ఉండొచ్చని అనుకుంటున్నారు.

Dharsha
Darshan

రీసెంట్​గా ఒక ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. దర్శన్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అదృష్ట దేవత ఎప్పుడూ తలుపు తట్టదు. ఆమె తట్టినప్పుడు, ఆమెను పట్టుకుని, మీ బెడ్‌రూమ్‌లోకి లాగి, వివస్త్రను చేయండి. మీరు ఆమెకు బట్టలు ఇస్తేనే అవి వేసుకుని ఆమె బయటకు వెళ్తుంది అంటూ నోటి దురుసు మాటలు మాట్లాడాడు. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు దర్శన్​పై దుమ్మెత్తిపోస్తున్నారు.

చాలా మంది ట్విటర్‌లో అతని ప్రవర్తనను ఖండిస్తున్నారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వివాదం కన్నడ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. దర్శన్ క్రాంతి సినిమా జనవరి 26న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ సినిమాకు వి హరికృష్ణ కథ అందించి డైరెక్షన్ చేశారు. ఈ మూవీలో రవిచంద్రన్, సుమలత కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం దర్శన్​పై చెప్పు దాడి.. అతడి వ్యాఖ్యల వివాదం ప్రభావం ఈ మూవీపై పడే అవకాశం ఉందని శాండల్​వుడ్​లో టాక్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here