Payal Rajput ‘ఆర్ ఎక్స్ 100’ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే.. అందులో హీరోయిన్ అయితే జీవించింది..బాబోయ్ తట్టుకోవడం కష్టమే..ఇలాంటి మాటలను అందుకుంది ఆ చిత్ర హీరోయిన్ పాయల్.. అనుకున్న దానికన్నా ఎక్కువగానే హిట్ టాక్ ను అందుకుంది.. ఈ సినిమాలో కార్తికేయ హీరోగా చేశారు.. ఈ సినిమాను డైరెక్టర్ అజయ్ భూపతి తెరకేక్కించారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యింది.. పాయల్ అందం అభినయంతో స్టార్ హీరోయిన్ గా పాపులర్ అవుతుందని అందరు అనుకున్నారు.. కానీ సెకండ్ హీరోయిన్ గా మిగిలింది.. ఇప్పుడు మళ్ళీ అదే డైరెక్టర్ తో అలాంటి సినిమా చెయ్యనుందని వార్తలు వినిపిస్తున్నాయి..

ఆ సినిమా తర్వాత అమ్మడుకు అలాంటి కంటెంట్ ఉన్న సినిమాలే రావడం విశేషం.. అంతేకాదు ఐటమ్ సాంగ్స్ కూడా చేసింది..అలా ఏ ఛాన్స్ వచ్చిన కూడా వదులుకోకుండా చేస్తూ వచ్చింది.. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడుకు ఫాలోయింగ్ ఏ రేంజులో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పల్సిన పని లేదు.. రోజుకో విధంగా ఫోటోలను తీస్తూ షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది..ఈ మధ్య కాలంలో పాయల్ పెద్దగా సినిమాలో కనిపించలేదు…

ఇది ఇలా ఉండగా.. తాజాగా అజయ్ భూపతి మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో రానున్నారు. ఇప్పటికే దీనికి ‘మంగళవారం’ అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేశారు. కాగా ఈ సినిమాలో మరోసారి పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్ గా నటించనుందని టాక్ వినిపిస్తుంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. లేడీ ఓరియెంటెడ్ తరహాలో ఈ సినిమాను రూపొందించనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే షూటింగ్ ప్రారంభించిన మేకర్స్ ఈ వేసవి కానుకగా సినిమాను రిలీజ్ చేయనున్నారు.. ఈ సినిమా అన్న పాయల్ ఇమేజ్ ను పెంచుతుందేమో చూడాలి..