Tum Tum Song : విశాల్ పాటతో బీభత్సం సృష్టిస్తున్న బుల్లితెర, సినీ, స్టార్ సెలబ్రిటీస్.. సృష్టిస్తున్న

- Advertisement -

Tum Tum Song : తమిళ స్టార్ హీరో విశాల్ నటించిన ఎనిమి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో మృణాళిని రవి, మమతా మోహన్ దాస్ హీరోయిన్స్ గా నటించారు.. ఈ సినిమాలోని తుమ్ తుమ్ సాంగ్ ఎంతటి సక్సెస్ ను అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇప్పటికే ఈ సాంగ్ తో ఎంతోమంది సినీ సెలబ్రిటీలు, బుల్లితెర తారలు రీల్స్ చేసి సోషల్ మీడియాలో వదిలారు.. అవి ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.. బుల్లితెర సీరియల్స్ లో నటించే పలువురు నటీనటులు కూడా ఈ పాటకి డాన్స్ చేస్తూ రీల్స్ పోస్ట్ చేశారు.

Tum Tum Song
Tum Tum Song

ఇక అదే విధంగా సురేఖ వాణి తన కూతురు, నటి ప్రణీత తో పాటు.. మరికొంతమంది టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ పాటకు తమదైన శైలిలో డాన్స్ చేస్తూ అదిరిపోయే రీల్స్ ను షేర్ చేసుకున్నారు..

ఇంటింటి గృహలక్ష్మి ఫ్రేమ్ కస్తూరి కూడా తుమ్ తుమ్ సాంగ్ రీల్ చేసి సోషల్ మీడియాలో వదిలింది. అలనాటి స్టార్ హీరోయిన్, శ్రీదేవి డ్రామా కంపెనీ హోస్ట్ జబర్దస్త్ జడ్జి ఇంద్రజ కూడా తాజాగా ఎనిమి సినిమాలోని తుమ్ తుమ్ సాంగ్ రీల్ చేసి పోస్ట్ చేయగా అది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది..

- Advertisement -

బాలీవుడ్ తారలైన విద్యాబాలన్ , మాధురి దీక్షిత్ కూడా ఈ పాటకు రిలీజ్ చేసి ఇంటర్నెట్లో పోస్ట్ చేయగా బిలియన్స్ కొద్ది వ్యూస్ అందుకున్నాయి..

బరాక్ సింగ్ కూడా ఈ సాంగ్ రీల్ చేసి తన డ్యాన్స్ స్టెప్పులతో అదరగొట్టాడు. టివి స్టార్ రూపాలి గంగూలీ, అల్పన బుచ్ తో కలిసి ఈ పాట కి మెస్మరైజింగ్ స్టెప్స్ వేసి ఆకట్టుకున్నారు.

ముంబై ఇండియన్స్ టీం కూడా కలిసి బ్లాస్టింగ్ పర్ఫామెన్స్ ఇచ్చారు.. ఈ సాంగ్ తో రీల్ చేసి ఇప్పటికీ ఆ రీల్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది..

టాన్ జానియన్ ఇన్ఫ్లుయెన్సర్ కంటెంట్ క్రియేటర్ కిల్లి పాల్ కూడా ఈ పాటకు డాన్స్ చేస్తూ ఓ రిల్ పోస్ట్ చేశారు.. అప్పట్లో ఈ రీల్ సోషల్ మీడియాలో సునామీని సృష్టించింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here