Rajputh Payal : క్యూట్​నెస్​తో మెస్మరైజ్ చేస్తున్ రాజ్​పుత్ పాయల్

- Advertisement -

Rajputh Payal.. ఆర్​ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్​లోకి జెడ్ స్పీడ్​లో దూసుకొచ్చింది ఈ అమ్మడు. ఆ తర్వాత ఆర్​డీఎక్స్ లవ్ చిత్రంతో సూపర్ బ్లాస్ట్ చేసింది. ఈ సినిమాలతో ఈ బ్యూటీ రేంజ్ టాలీవుడ్​లో అమాంతం పెరిగిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ పాయల్​కు ఆ తర్వాత అంతగా అవకాశాలు రాలేదు. అడపా దడపా అవకాశాలతో తన కెరీర్​ను నెట్టుకొస్తున్న పాయల్ రాజ్​పుత్​కు ఇటీవల మంగళవారం అనే సినిమాతో సూపర్ హిట్ దక్కింది. తొలి చిత్రంలో తన అందానికి ఫిదా అయిన ప్రేక్షకులు మంగళవారం మూవీలో ఈ భామ నటనకు మెస్మరైజ్ అయ్యారు. డీ గ్లామర్ రోల్​లో పాయల్ నటన అమాంతం ప్రేక్షకులను కట్టిపడేసింది.

Payal Rajput
Payal Rajput

అలా నెమ్మదిగా సినిమాలతో బిజీ అయిన పాయల్ సోషల్ మీడియాలోనూ యాక్టివ్​గా కనిపిస్తోంది. తాజాగా ఈ భామ బ్లూకలర్ డ్రెస్సులో ఫొటోషూట్ చేసింది. ఎప్పుడూ ఘాటుగా, నాటీగా పోజులిస్తూ కవ్వించే పాయల్ ఈసారి తన క్యూట్​నెస్​తో మెస్మరైజ్ చేసింది. బ్లూ కలర్ ఔట్ ఫిట్​లో ఈ భామ అందం మామూలుగా లేదు. క్యూట్ స్మైల్​తో మరింత క్యూట్ లుక్స్​తో కట్టిపడేసింది ఈ భామ. ఎక్స్​పోజింగ్ లేకుండానే తన అందంతో కుర్రాళ్లు ఎంగేజ్ అయ్యేలా చేసింది ఈ అమ్మడు. సోషల్ మీడియాలో పోస్టు చేసిన కాసేపటికే ఈ ఫొటోలు వైరల్​గా మారాయి.

Payal Rajput Photos

- Advertisement -

పాయల్ ఆర్​ఎక్స్ 100, ఆర్​డీఎక్స్ లవ్, వెంకీ మామ, డిస్కో రాజా, అనగనగా ఓ అతిథి, జిన్నా, తీస్​మార్ ఖాన్, మంగళవారం, మాయా పేటిక, చిత్రాలతో సందడి చేసింది. కిరాతక, 5Ws అనే అనే తెలుగు చిత్రాల్లో, తమిళ్ గోల్​మాల్ మూవీలో నటిస్తోంది. ఇవే కాకుండా ఈ భామ పలు షోలకు జడ్జిగా ఇంకొన్ని రియాల్టీ షోలకు అప్పుడప్పుడు గెస్టుగా వచ్చి అలరిస్తూ ఉంటుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here