Rajputh Payal.. ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్లోకి జెడ్ స్పీడ్‌లో దూసుకొచ్చింది ఈ అమ్మడు. ఆ తర్వాత ఆర్డీఎక్స్ లవ్ చిత్రంతో సూపర్ బ్లాస్ట్ చేసింది. ఈ సినిమాలతో ఈ బ్యూటీ రేంజ్ టాలీవుడ్లో అమాంతం పెరిగిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ పాయల్‌కు ఆ తర్వాత అంతగా అవకాశాలు రాలేదు. అడపా దడపా అవకాశాలతో తన కెరీర్‌ను నెట్టుకొస్తున్న పాయల్ రాజ్‌పుత్‌కు ఇటీవల మంగళవారం అనే సినిమాతో సూపర్ హిట్ దక్కింది. తొలి చిత్రంలో తన అందానికి ఫిదా అయిన ప్రేక్షకులు మంగళవారం మూవీలో ఈ భామ నటనకు మెస్మరైజ్ అయ్యారు. డీ గ్లామర్ రోల్లో పాయల్ నటన అమాంతం ప్రేక్షకులను కట్టిపడేసింది.

అలా నెమ్మదిగా సినిమాలతో బిజీ అయిన పాయల్ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా కనిపిస్తోంది. తాజాగా ఈ భామ బ్లూకలర్ డ్రెస్సులో ఫొటోషూట్ చేసింది. ఎప్పుడూ ఘాటుగా, నాటీగా పోజులిస్తూ కవ్వించే పాయల్ ఈసారి తన క్యూట్‌నెస్‌తో మెస్మరైజ్ చేసింది. బ్లూ కలర్ ఔట్ ఫిట్‌లో ఈ భామ అందం మామూలుగా లేదు. క్యూట్ స్మైల్‌తో మరింత క్యూట్ లుక్స్‌తో కట్టిపడేసింది ఈ భామ. ఎక్స్పోజింగ్ లేకుండానే తన అందంతో కుర్రాళ్లు ఎంగేజ్ అయ్యేలా చేసింది ఈ అమ్మడు. సోషల్ మీడియాలో పోస్టు చేసిన కాసేపటికే ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి.
పాయల్ ఆర్ఎక్స్ 100, ఆర్డీఎక్స్ లవ్, వెంకీ మామ, డిస్కో రాజా, అనగనగా ఓ అతిథి, జిన్నా, తీస్మార్ ఖాన్, మంగళవారం, మాయా పేటిక, చిత్రాలతో సందడి చేసింది. కిరాతక, 5Ws అనే అనే తెలుగు చిత్రాల్లో, తమిళ్ గోల్మాల్ మూవీలో నటిస్తోంది. ఇవే కాకుండా ఈ భామ పలు షోలకు జడ్జిగా ఇంకొన్ని రియాల్టీ షోలకు అప్పుడప్పుడు గెస్టుగా వచ్చి అలరిస్తూ ఉంటుంది.
#PayalRajput 🥰✨ pic.twitter.com/jQX9CBz03j
— Only Heroines (@OnlyHeroines) April 13, 2024