పవన్ కళ్యాణ్ భార్య కి ఇష్టమైన నేటి తరం టాలీవుడ్ స్టార్ హీరో అతనేనా..?

- Advertisement -

ఒకపక్క రాజకీయాలు మరోపక్క సినిమాలు అంటూ క్షణం తీరిక లేకుండా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘వారాహి యాత్ర’ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. నిన్న మొన్నటి వరకు #OG మూవీ షూటింగ్ లో బిజీ గా గడిపిన పవన్ కళ్యాణ్ ఈ నెల మొత్తం ‘వారాహి యాత్ర’ మొదటి విడత ని పూర్తి చెయ్యబోతున్నాడు.

అన్నా లెజినోవా
అన్నా లెజినోవా

అయితే నిన్న జరిగిన పిఠాపురం వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ తన ప్రసంగం లో ‘సినిమా పరంగా ఎవరిని అయినా ఇష్టపడొచ్చు, కానీ రాజకీయ పరంగా మాత్రం అందరూ ఒక తాటి పై నిలబడాలి, సినిమాలు వేరు రాజకీయాలు వేరు, నేను కూడా నా తోటి హీరోల సినిమాలను చూస్తూ ఉంటాను. రామ్ చరణ్ , ఎన్టీఆర్ , ప్రభాస్ , చిరంజీవి వీళ్ళ సినిమాలను మిస్ కాకుండా చూస్తుంటాను’ అని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చిన మాటలు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Prabhas

పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు కూడా చాలా సందర్భాలలో ఎన్టీఆర్ మరియు ప్రభాస్ పేర్లను చెప్పుకొచ్చాడు. దీనిని బట్టి ఆయనకీ బాగా ఇష్టమైన నటులు వాళ్లిద్దరే అని అర్థం అవుతుంది. అయితే పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా కి మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు అంటే బాగా ఇష్టమట. ఆయన నటన మరియు వైవిధ్యమైన సినిమాలకు పెద్ద ఫ్యాన్ అని తెలుస్తుంది.

- Advertisement -
Mahesh Babu

అంతే కాకుండా మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ కూడా అన్నా లెజినావా కి మంచి స్నేహితురాలట. ప్రతీ క్రిస్మస్ కి మహేష్ – నమ్రత దంపతులకు బహుమతులు పంపిస్తూ ఉంటుంది అన్నా లెజినావా. దీనిని బట్టి వాళ్లిద్దరూ ఎంత మంచి స్నేహితులో అర్థం అవుతుంది. ఈ విషయం తెలుసుకొని మహేష్ బాబు అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు. తమ అభిమాన హీరో కి పోటీ ని ఇచ్చే మరో హీరో భార్య ఇలా మా హీరో కి అభిమాని అవ్వడం గర్వంగా ఉందని చెప్పుకొస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here