ఇకపై దాని జోలు వెళ్లను బుద్ధి వచ్చిందంటున్న అవికా గోర్..

- Advertisement -

చిన్నారి పెళ్లికూతురు అనే హిందీ డబ్బింగ్ సీరియల్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది అవికా గోర్. అటు తర్వాత ‘ఉయ్యాలా జంపాలా’ ‘సినిమా చూపిస్తా మావ’ ‘ఎక్కడికి పోతావ్ చిన్నవాడా’ వంటి హిట్ చిత్రాల్లో నటించి మరింతగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత అధిక బరువు కారణంగా ఈమెకు అవకాశాలు రాలేదు. సన్నబడడానికి కొంత గ్యాప్ తీసుకుని ‘రాజు గారి గది 3 ‘ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది.

అవికా గోర్
అవికా గోర్

అటు తర్వాత ‘#bro ‘ ‘నెట్’ ‘టెన్త్ క్లాస్ డైరీస్’ ‘పాప్ కార్న్’ ‘థాంక్యూ’ ‘ఉమాపతి’ వంటి సినిమాల్లో నటించింది కానీ అవి సక్సెస్ అవ్వలేదు. అయితే ‘పాప్ కార్న్’ అనే సినిమాకి ఈమె నిర్మాత కూడా..! అయినా ఆ సినిమా రూపంలో ఈమెకు సక్సెస్ దొరకలేదు. నిర్మాతగా మారేంతలా ఈమె సంపాదించిందో లేదో తెలీదు కానీ.. నిర్మాతగా మారి చాలా వరకు పోగొట్టుకుంది.

సినీ పరిశ్రమలో ఎందుకో అందరికీ నిర్మాణ రంగంపై ఆసక్తి ఉంటుంది.అయితే అప్పట్లో సావిత్రి, విజయశాంతి వంటి స్టార్ హీరోయిన్స్ కూడా నిర్మాతగా రంగ ప్రవేశం చేసి డబ్బులు పోగొట్టుకున్న వాళ్లే ఇప్పుడు ఈ లిస్టులో అవిక గోర్ కూడా చేరిందనే చెప్ప వచ్చు.. అయితే ఆమె డబ్బులు పోగొట్టుకున్న తర్వాత తొందరగా రియలైజ్ అయి నిర్మాణ రంగానికి గుడ్ బై చెప్పినట్టు తెలుస్తోంది.. చాలామంది ఫస్ట్ గా హీరో హీరోయిన్ల గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాతగా నిర్మాతలుగా మారిన వారు చాలామందే ఉన్నారు.. అందులో సక్సెస్ చాలా తక్కువ మంది అందుకున్నారు.త్వరలో ఈమె 1920 హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు రానుంది. నిర్మాణ రంగానికి గుడ్ బై చెప్పడంతో అభిమానులు ఒక్క సినిమాకే ఈ ముద్దుగుమ్మ భయపడిపోయిందా అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here