సమంత ఆ వెబ్ సిరీస్‌ కోసం అంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందా?

- Advertisement -

స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతుంది..ఎన్ని కష్టాలు వచ్చిన కూడా వెనక్కి తగ్గకుండా లైఫ్ ను బిజీగా ఉంది.. ఎప్పటికప్పుడు కొత్త అవకాశాలను అందిపుచ్చుకుని హీరోయిన్‌గా రాణిస్తుంది. స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తూ క్రేజీ ఆఫర్లని దక్కించుకుంటూ దూసుకుపోతుంది..ఇటీవల సమంత నటించిన యశోద సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వగా.. మొన్న రిలీజ్ అయిన శాకుంతలం సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది..ఇప్పుడు వెబ్ సిరీస్ లో నటిస్తుంది.. అయితే సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది..

సమంత
సమంత

ప్రస్తుతం ఆమె తెలుగులో ఖుషీ చిత్రం చేస్తుంది. హిందీలో హాలీవుడ్‌ రీమేక్‌ సిటాడెల్‌ లో నటిస్తుంది. ఈ వెబ్‌ సిరీస్‌లో షాహిద్‌ కపూర్‌తో జోడీ కట్టింది సమంత.. అయితే ఈ వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నందుకు సమంత భారీగా రెమ్యూనరేషన్ అందుకుంటుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ సిరీస్ కోసం సమంత పది కోట్ల పారితోషికం అందుకుంటుందట. తన కెరీర్‌లో ఇప్పటి వరకు ఇంత పెద్ద మొత్తంలో పారితోషికం అందుకోవడం ఇదే తొలిసారి అని చెప్పొచ్చు. అంత భారీ మొత్తం కాబట్టే సమంత ఇందులో నటించేందుకు ఒప్పుకుందట. అంతేకాదు ఇందులో యాక్షన్‌ చేయడంతో పాటు రొమాంటిక్‌ సన్నివేశాల్లోనూ నటించేందుకు రెడీ అయ్యింది..

samantha

సమంత ఇప్పటికే ది ఫ్యామిలీ మ్యాన్‌ 2లో నటించింది. ఇందులో రాజీ పాత్రలో ఇరగదీసింది. యాక్షన్‌ చేసి వాహ్‌ అనిపించింది. బోల్డ్ సీన్లలోనూ నటించింది. ఈ వెబ్‌ సిరీస్‌తోనే నార్త్ ఆడియెన్స్ కి దగ్గరయ్యింది. ఇప్పుడు సమంత కి నార్త్ నుంచి, హాలీవుడ్‌ నుంచి ఆఫర్లు వస్తున్నాయంటే ఈ వెబ్‌ సిరీస్‌ పాత్ర చాలా కీలకమని చెప్పొచ్చు.. అయితే త్వరలోనే హాలివుడ్ సినిమాలో నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి..ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.. ఎప్పటికప్పుడు ఫోటో షూట్ లను చేస్తూ నెట్టింట వదులుతుంది.. అవి ఎంతగా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇక నెక్స్ట్ ఏ సినిమా చేస్తుందా అని ఫ్యాన్స్ ఆసక్తి ఎదురుస్తున్నారు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here