Unstoppable 2 : పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ సంక్రాంతికి కాదట..మరి ఎప్పుడంటే?

- Advertisement -

బాలయ్య హోస్ట్‌గా వ్యవహరిస్తున్న Unstoppable 2 షో చేస్తున్నారు. మొన్నీమద్య ప్రభాస్, గోపిచంద్. లు వచ్చి సందడి చేసిన విషయం తెలిసిందే.. ఆ ఎపిసోడ్ ప్రోమో వీడియోలు నెట్టింట వైరల్ అవుతూనే వున్నాయి.. ఇకపోతే లేటెస్ట్ పవన్ కళ్యాణే షూటింగ్ పూర్తి అయ్యింది..అటు పవర్ స్టార్ అభిమానులతో పాటు బాలయ్య ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అన్‌ స్టాపబుల్‌ ఎపిసోడ్‌ స్ట్రీమింగ్‌ విషయమై ఆహా ఓటీటీ ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటి వరకు ఇవ్వలేదు. దీంతో ఆ అప్ డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా ఎదురు చూస్తున్నారు..

Pawan Kalyan at Unstoppable 2
Pawan Kalyan at Unstoppable 2

ఈయన కన్నా ముందు డార్లింగ్ ప్రభాస్ షో కి వచ్చిన సంగతి తెలిసిందే..ఆ షో కు రెండు ఎపిసోడ్లను చేశారు..ఒకటి డిసెంబర్ 30న స్ట్రీమింగ్ చేశారు. అయితే మరో ఎపిసోడ్‌ను ఈ శుక్రవారం స్ట్రీమింగ్ చేయనున్నారు. అయితే… ప్రభాస్ ఎపిసోడ్‌కు ఫుల్’గా ప్రమోషన్లు నిర్వహించారు.పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ను కూడా అదే రేంజ్‌లో ప్రమోషన్లు చేయాలని ఆహా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్‌తో బాలయ్య అనేక విషయాలప చర్చించారు. షోలో ఆయన వ్యక్తిగత విషయాలతో పాటు… రాజకీయాలపై కూడా బాలయ్య పవన్‌ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది..

ఈ ఎపిసోడ్ ను అన్నీ విధాలుగా వాడే పనిలో ఆహా టీం..అందుకే పవన్, బాలయ్య ఎపిసోడ్‌కు కూడా బలంగా ప్రొమోలు మరియు అప్ డేట్లు ఇచ్చే పనిలో పడింది ఆహా టీం. ప్రభాస్ ఎపిసోడ్ ఈ వారం అయిపోతే.. వచ్చేవారమే పవర్ స్టార్ ఎపిసోడ్ వచ్చేస్తుందని అంతా భావించారు. సంక్రాంతికి అసలైన పండగ అంటూ… పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు.కానీ ఇప్పుడు మరో వార్త చక్కర్లు కొడుతోంది..బాలయ్య ఫ్యాన్స్ తో పాటు పవన్‌ ఫ్యాన్స్ కు నిరాశ కలిగే విధంగా సంక్రాంతికి స్ట్రీమింగ్‌ లేదు అని తేలిపోయింది.

- Advertisement -

ఇకపోతే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్‌ ను కనీసం మూడు నాలుగు వారాల ముందు నుండే హడావుడి చేయాలని అనుకుంటున్నారు ఆహా నిర్వాహకులు. ఆహా సబ్‌స్క్రైబర్స్ ఖాతాదారుల సంఖ్య పెరగాలి అంటే ప్రమోషన్‌ ఎక్కువ చేయాలి. స్పెషల్ పోస్టర్లు, షార్ట్ వీడియోలు… ప్రొమోలు ఇలా అన్ని చేయాల్సి ఉంటుంది.ఎపిసోడ్ పై జనాలను బాగా ఊరించి ఆ తర్వాత ఎపిసోడ్ ను వదిలే ప్లాను లో ఆహా టీం ఉన్నట్లు చెబుతున్నారు..అప్పటివరకూ ఫ్యాన్స్ వెయిట్ చెయ్యక తప్పదు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here