Guess Actress : టాలివుడ్ హీరోయిన్లు చాలా మంది సందు దొరికితే చాలు సముద్ర తీరాల్లో వాలిపోతున్నారు.. కొందరు ఎంజాయ్ చేస్తే మరి కొంతమంది అందాలను ఆరబొస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రచ్చ చెస్తున్నారు..అందులో హీరోయిన్ రష్మిక మందన్న ఒకరు.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్ట్ లు చేస్తూ వస్తుంది..వాటికి ట్రోల్స్ కూడా బాగానే వస్తున్నాయి.. తాజాగా మరో ఫొటోను షేర్ చేసింది..అందులో బ్రాక్ డ్రెస్సులో సముద్ర తీరానా సేదతీరుతున్నట్లు కనిపించింది..అది కాస్త వైరల్ అవుతున్నాయి.
ఇకపోతే రష్మిక మందన్న ఈ మధ్యకాలంలో వరుస వివాదాలను ఎదుర్కొంటున్నారు. ఆమె ఓ హిందీ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. మిషన్ మజ్ను అనే పేరుతో వస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రష్మిక చేసిన కొన్ని కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ సందర్భంగా రొమాంటిక్ సాంగ్స్ ను తెరకెక్కించడంలో బాలీవుడ్ ది బెస్ట్ అని ప్రశంసించారు..సౌత్‌లో ఎక్కువగా మాస్ మసాలా, ఐటెమ్ సాంగ్స్ ఉంటాయని తెలిపుతూ.. కమర్షియల్ హంగులే ఎక్కువగా ఉంటాయంటూ సౌత్ ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడారు. దీంతో ఒక్కసారిగా రష్మికపై మరోసారి నెటిజన్స్ మండిపడుతున్నారు.
అంతేకాదు విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు..దీని పై చర్చలు కూడా ఎక్కువగా జరిగాయి..కన్నడ నుంచి తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తున్న సమయంలో కన్నడ చిత్రాలను తక్కువ చేసి మాట్లాడావు.. తెలుగు నుంచి బాలివుడ్ కు వెళ్ళిన సంగతి గుర్తు పెట్టుకొవాలి.. అని ట్రోల్స్ వస్తున్నాయి.పుష్ప సినిమాతో ప్యాన్ ఇండియా లెవల్లో అలరించారు రష్మిక మందన్న. ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా చేశారు. సుకుమార్ దర్శకుడు. ఈ సినిమా 2021 డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బంపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. పుష్ప తెలుగు, హిందీ. తమిళ, మలయాళ, కన్నడ భాషాల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇప్పుడు పుష్ప2 సినిమాలో చేస్తుంది..