Pawan Kalyan – Shankar టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ మరో హీరో కి లేదని టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ దగ్గర నుండి విశ్లేషకుల వరకు అందరూ చెప్పే మాట.హిట్ మరియు ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఆయన క్రేజ్ ఎప్పటికీ పెరుగుతూ ఉండడమే తప్ప తరగడం ఉండదని అంటుంటారు.ఇదంతా ప్రాక్టికల్ గా కూడా నూరూపితమైంది.పొలిటికల్ గా జనసేన పార్టీ ఓడిపొయ్యినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ని అభిమానించే వారి సంఖ్య ఏమాత్రం తగ్గిపోలేదు, ఇంకా పెరిగింది.

OTT రాజ్యం ఏలుతున్న ఈ రోజుల్లో రీమేక్ సినిమాలను అసలు ఎవ్వరూ పట్టించుకోలేదు.అలాంటిది పవన్ కళ్యాణ్ రీమేక్ సినిమాలతోనే ఇండస్ట్రీ రికార్డ్స్ ని బద్దలు కొడుతున్నాడు.ఆయన నటించిన గత రెండు చిత్రాలు రీమేక్ సినిమాలే, దానికి తోడు రెండు చిత్రాలకు ఆంధ్ర ప్రదేశ్ లో టికెట్ రేట్స్ లేవు, అయ్యినప్పటికీ కూడా ఈ సినిమా వంద కోట్ల రూపాయిలను వసూలు చేసింది.

పవన్ కళ్యాణ్ చేస్తున్న రీమేక్ సినిమాలకే ఇంత క్రేజ్ ఉంటే, ఆయనే మిగతా హీరోలలాగా క్రేజీ డైరెక్టర్స్ తో సినిమాలను సెట్ చేసుకుంటే ఇక ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేము.సరిగ్గా అలాంటి ఛాన్స్ చేతులు దాకా వచ్చి ఈమధ్యనే మిస్ అయ్యింది.వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం రామ్ చరణ్ తో సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ ‘గేమ్ చేంజర్’ అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాని తొలుత డైరెక్టర్ శంకర్ పవన్ కళ్యాణ్ తో చేద్దాం అనుకున్నాడట.

దిల్ రాజు కి కూడా ఇదే విషయం చెప్తే అప్పుడు దిల్ రాజు ఈ కథ పవన్ కళ్యాణ్ గారికంటే రామ్ చరణ్ కి బాగా సూట్ అవుతుంది,ఆయనతోనే ఈ చిత్రం చేద్దామని చెప్పి రామ్ చరణ్ కి ఈ కథని షిఫ్ట్ చేసాడట.ఈ విషయం స్వయంగా దిల్ రాజు రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.మా హీరో కి క్రేజీ ప్రాజెక్ట్ రానివ్వకుండా చేస్తావా అంటూ దిల్ రాజు ని ట్యాగ్ చేసి సోషల్ మీడియా లో తిడుతూ ఉన్నారు ఫ్యాన్స్.