పవన్ కళ్యాణ్ లేకపోతే ‘బలగం’ అనే సినిమానే లేదా..వైరల్ అవుతున్న Director Venu కామెంట్స్

- Advertisement -

Director Venu ఇటీవల కాలంలో చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన చిత్రాలలో ఒకటి ‘బలగం’.ప్రముఖ కమెడియన్ వేణు దర్శకుడిగా మారి తన మాతృ భూమి తెలంగాణ సంస్కృతి గురించి చాటిచెప్తూ తీసిన ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.రోజు రోజుకి కలెక్షన్స్ పెరుగుతూ చిన్న సినిమా నుండి పెద్ద సినిమాగా అవతరించింది.ప్రియదర్శి మరియు కావ్య కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లు గా నటించిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించాడు.

Director Venu
Director Venu

మంచి సినిమాని సరైన పద్దతి లో ప్రమోట్ చేసి కమర్షియల్ గా భారీ లాభాలను పొందాడు.నేడు ఉన్న వసూళ్లు మొదటి రోజు వసూళ్లకంటే మూడు రెట్లు ఎక్కువ ఉన్నాయి అంటే ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ అనేది అర్థం చేసుకోవచ్చు.ఒక్క నైజాం ప్రాంతం నుండే ఈ చిత్రం ఫుల్ రన్ లో 20 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.

priyadarshi

ఈ చిత్ర దర్శకుడు వేణు కి ‘బలగం‘ విజయం పట్ల ఎంత ఆనందంగా ఉంది ఉంటాడో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.అయితే రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి.ఆయన మాట్లాడుతూ ‘నాలో ఇంత ఆత్మవిశ్వాసం కలిగి ఒక సినిమాకి దర్శకత్వం వహించే రేంజ్ కి ఎదిగాను అంటే అందుకు కారణం పవన్ కళ్యాణ్ గారు నాలోని టాలెంట్ ని గుర్తించడం వల్లే.కేవలం కమెడియన్ గా ఉన్న నేను ‘అత్తారింటికి దారేది’ షూటింగ్ సమయం లో పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు ఆయన నాతో చెప్పిన మాటలను ఎప్పటికీ మర్చిపోలేను.

- Advertisement -
venu tillu

వేణు నీ స్కిట్స్ చాలా చూసాను, నువ్వు కేవలం కమెడియన్ వి మాత్రమే కాదు, ఒక మంచి నటుడివి మరియు దర్శకుడివి కూడా, కేవలం కామెడీ రోల్స్ కి మాత్రమే పరిమితం అవ్వకు,నీలో చాలా టాలెంట్ ఉంది.ఉపయోగించుకో అని చెప్పాడు, ఆ రోజు ఆయన ఇచ్చిన స్ఫూర్తి నేడు సక్సెస్ ఫుల్ దరక్షకుడిగా నేను మీ ముందు కూర్చునేలా చేసింది’ అంటూ వేణు ఎంతో ఎమోషనల్ గా మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here