Pawan Kalyan తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ వంటి టాపిక్స్ వస్తే మన అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పటికీ , మొదటి సినిమా నుండే ప్రత్యేకమైన స్టైల్ తో యూత్ ని ఆకట్టుకొని ఐకాన్ గా ఎదిగాడు.పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ లాంటి ఊరమాస్ సినిమాలు చెయ్యొచ్చు, తమ్ముడు వంటి ఎంటర్టైన్మెంట్ సినిమాలు చెయ్యొచ్చు, అత్తారింటికి దారేది లాంటి ఫ్యామిలీ మూవీస్ తియ్యొచ్చు మరియు ఖుషి , తొలిప్రేమ వంటి యూత్ ఫుల్ లవ్ స్టోరీస్ కూడా తియ్యొచ్చు.ఇలా అన్ని జానర్స్ కి సరిపడే హీరో దొరకడం చాలా అరుదు.అందుకే స్టార్ డైరెక్టర్స్ అందరూ పవన్ కళ్యాణ్ తో సినిమాలు చెయ్యడానికి క్యూ కట్టేవారు.కానీ ఆయన మాత్రం వివిధ కారణాల చేత ఆయా ప్రాజెక్ట్స్ ని రిజెక్ట్ చేసేవాడు.అలా ఆయన రిజెక్ట్ చేసిన సినిమాలతో స్టార్ హీరోలుగా ఎదిగిన వారి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము.

మహేష్ బాబు ని మామూలు హీరో నుండి సూపర్ స్టార్ గా నిలబెట్టిన సినిమాలు అతడు మరియు పోకిరి.వీటిల్లో అతడు కమర్షియల్ గా పెద్ద హిట్ కాదు కానీ, పోకిరి ఎలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అనేది మనకి తెలిసిందే.ఆ సినిమా మహేష్ కెరీర్ కి ఇచ్చిన మైలేజ్ మామూలుది కాదు, మాస్ లో మంచి ఫాలోయింగ్ ని తెచ్చిపెట్టింది.ఈ రెండు సినిమాలు పవన్ కళ్యాణ్ చెయ్యాల్సినవే అని త్రివిక్రమ్ , పూరి జగన్నాథ్ ఎన్నో సందర్భాలలో తెలిపారు.అప్పుడు అలా పవన్ కళ్యాణ్ వదిలేసిన ఈ సినిమాలు మహేష్ బాబు వద్దకి వెళ్లాయి..ఆయన సూపర్ స్టార్ అయిపోయాడు.

మాస్ మహారాజ రవితేజ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ వదులుకున్నవే.ఇడియట్ , అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి,విక్రమార్కుడు, మిరపకాయ్ ఇలా ఎన్నో సినిమాలు ఉన్నాయి.ఆరోజుల్లో పూరి జగన్నాథ్ ఏ కథ రాసుకున్నా పవన్ కళ్యాణ్ వద్దకే వెళ్ళేవాడు, ఆయన వెళ్లి కథ చెప్పడం,పవన్ కళ్యాణ్ ఎదో ఒక కారణం తో రిజెక్ట్ చెయ్యడం, పూరి జగన్నాథ్ అదే కథలతో వేరే హీరో తో చేసి హిట్టు కొట్టడం.ఇది ఆరోజుల్లో చాలా కామన్ అయ్యిపోయేది.

ఇక లవర్ బాయ్ తరుణ్ ఇండస్ట్రీ కి హీరో గా పరిచయం అవుతూ తెరకెక్కిన సినిమా ‘నువ్వే కావాలి’.ఆరోజుల్లో ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం మామూలుది కాదు.అప్పటి వరకు ఇండస్ట్రీ లో ఉన్న రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది ఈ చిత్రం.ఈ సినిమాని తొలుత శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ లో పవన్ కళ్యాణ్ – అమీషా పటేల్ హీరో హీరోయిన్లుగా ‘చెప్పాలని ఉంది’ అనే టైటిల్ తో ప్రారంభించారు.ఫోటో షూట్స్ కూడా చేసారు.కానీ ఆ తర్వాత ఏమి జరిగిందో ఏమో తెలియదు కానీ, సినిమా మధ్యలోనే ఆగిపోయింది.ఆ తర్వాత రామోజీ రావు ఇదే కథ తో తరుణ్ ని పెట్టి ఇండస్ట్రీ హిట్ కొట్టేసాడు.

ఇక తమిళ హీరో సూర్య లో తెలుగు లో మంచి మార్కెట్ తెచ్చిపెట్టిన సినిమాలు యువ మరియు గజినీ.యువ సినిమాని మణిరత్నం హిందీ లో అజయ్ దేవగన్ తో తీసాడు, తమిళం .లో సూర్య తో తీసాడు, అలాగే తెలుగు లో పవన్ కళ్యాణ్ తో తీద్దాం అనుకున్నాడు.కథ కూడా ఆయనకీ చెప్పాడు.కానీ ఎందుకో ఆయనకీ నచ్చలేదు.ఇక గజినీ చిత్రాన్ని అల్లు అరవింద్ రీమేక్ రైట్స్ కొనుగోలు చేసి తెలుగు లో పవన్ కళ్యాణ్ తో చేద్దాం అనుకున్నాడు.కానీ గుండు లో అభిమానులు రిసీవ్ చేసుకుంటారో లేరో అని భయపడి ఆ చిత్రాన్ని చెయ్యలేదని పవన్ కళ్యాణ్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పడం మనం గమనించొచ్చు.

వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ తో సతమతమవుతున్న తమిళ హీరో విజయ్ కెరీర్ ని AR మురగదాస్ తెరకెక్కించిన ‘తుపాకీ’ చిత్రం ఏ రేంజ్ లో మలుపు తిప్పిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఆ సినిమా తో రీ సౌండ్ వచ్చే రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విజయ్ ఇప్పటికి సక్సెస్ ని కొనసాగిస్తూనే ఉన్నాడు.ఈ చిత్రాన్ని ముందుగా తెలుగు మరియు తమిళం బాషలలో కలిపి పవన్ కళ్యాణ్ తో తీద్దాం అనుకున్నాడు మురగదాస్,ఆరోజుల్లో మురగదాస్ తో పవన్ కళ్యాణ్ సినిమా అని పెద్ద ఎత్తున మీడియా లో ప్రచారం కూడా జరిగింది.కానీ ఎందుకో ఈ సినిమా కూడా కార్యరూపం దాల్చలేదు.ఇలా పవన్ కళ్యాణ్ వదిలేసినా సినిమాలన్నీ కూడా ఆయా హీరోల కెరీర్ లో మైల్ స్టోన్స్ గా నిలిచి వాళ్ళని మరో లెవెల్ కి తీసుకెళ్లాయి.
