ఇద్దరిలో Keerthy Suresh ఎవరు.? అక్కకి పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఫొటోస్ వైరల్..

- Advertisement -

Keerthy Suresh టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో కీర్తి సురేష్ కూడా ఒకరు.. సావిత్రి కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమాలో నటించిన కీర్తి సురేష్ అంటే సావిత్రి అన్నట్లుగా మారిపోయింది.. సాదాసీదాగా సాగిపోతున్న కీర్తి సురేష్ కెరియర్ మహానటి సినిమా కీలక మలుపు తిప్పింది.. ఆ తరువాత కీర్తి సురేష్ కు వరుస ఆఫర్లు క్యు కట్టాయి. ఈ సినిమా తరువాత లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసే స్థాయికి ఎదిగింది.. అందం, అభినయానికి కేరాఫ్ అడ్రస్ గా కీర్తి సురేష్ నిలుస్తుందన్న సంగతి తెలిసిందే.. తాజాగా కీర్తి సురేష్ తన అక్కకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది . ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

Keerthy Suresh
Keerthy Suresh

కీర్తి సురేష్ కి ఒక అక్క ఉందన్న విషయం.. తను కూడా కీర్తి సురేష్ పోలికలతోనే ఉంటుందనే విషయం అది కొద్ది మందికి మాత్రమే తెలుసు. కీర్తి సురేష్ అక్క రేవతి సురేష్ పుట్టినరోజు నేడు.. ఆ సందర్భంగా కీర్తి సురేష్ తన అక్కకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ చిన్ననాటి తల జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ.. ఆ జ్ఞాపకాలకు సంబంధించిన పలు ఫోటోలను షేర్ చేస్తూ.. తన అక్కకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.

Keerthi Suresh sister

నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు మాత్రమే కాకుండా చాలా ప్రేమ, హగ్స్ తో పాటు నా గ్యాలరీలో ఉన్న కొన్ని క్యూట్ మెమోరీస్ ని షేర్ చేసుకుంటున్నాను అక్కయ్.. ఈ ఇయర్ నీకు మరింత స్పెషల్ కావాలని కోరుకుంటున్నాను అంటూ కీర్తి సురేష్ తన అక్క రేవతి సురేష్ కి స్పెషల్ బర్త్డే విషెస్ ను తెలిపింది.. ప్రస్తుతం వారిద్దరి చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా రేవతి సురేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

- Advertisement -
Revathi

రేవతి సురేష్ చిన్నప్పుడు అచ్చం కీర్తి లాగే ఉంటుందని ఈ ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. కాకపోతే ఇటీవల ఆమె బరువు పెరిగి కాస్త బొద్దుగా తయారయ్యారు. దాంతో బంధువులు నన్ను చులకనగా మాట్లాడే వారిని మాటలకు చాలా బాధపడ్డాను అని రేవతి సురేష్ ఇటీవల తన పాత ఫోటోని షేర్ చేస్తూ ఇప్పుడు బరువు తగ్గాను అంటూ.. స్లిమ్ గా మారిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే.

కీర్తి సురేష్ నాచురల్ స్టార్ నాని దసరా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాల నుంచి విడుదలైన పాటలు టీజర్ తో మంచి బజ్ క్రియేట్ చేశారు. సింగరేణి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ వెన్నెలగా కనిపించనుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here