Unstoppable With NBK S2 : పూనకాలు లోడింగ్.. అన్‌స్టాపబుల్‌ పవర్ స్టార్ ప్రోమో వచ్చేసింది

- Advertisement -

Unstoppable With NBK S2 : బుల్లితెరపై అన్ స్టాపబుల్ గా దూసుకెళ్తున్న నందమూరి బాలకృష్ణ టాక్ షో.. అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే కు వస్తోన్న పాపులారిటీ గురించి తెలిసిందే. ఇప్పటికే టాప్ సెలబ్రిటీలతో సెకండ్ సీజన్ దుమ్ము లేపుతోంది. ఆహాకు ఎప్పుడూ రానంత భారీ రేటింగ్ తీసుకొస్తోంది. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎపిసోడ్ మామూలుగా స్ట్రీమింగ్ కాలేదు. ఒక దశలో ఆహా సర్వర్లు కూడా క్రాష్ అయ్యాయంటే ఈ షో క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. 

 Unstoppable With NBK S2
Unstoppable With NBK S2

ప్రభాస్ ఈ షోకు గెస్టుగా వచ్చిన తర్వాత పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కూడా పవర్ స్టార్ ను ఈ షోకు గెస్టుగా పిలవాలని ఆహాపై ఒత్తిడి తీసుకువచ్చారు. దెబ్బకు దిగొచ్చిన ఆహా పవర్ స్టార్ తో ఎపిసోడ్ ప్లాన్ చేసింది. పవన్ కల్యాణ్ తో ఎపిసోడ్ షూటింగ్ చేసి.. ఇటీవలే ప్రోమో కూడా రిలీజ్ చేసింది. అయితే సంక్రాంతి కానుకగా పవన్ కల్యాణ్ వస్తుందని భావించిన ఫ్యాన్స్ కు కాస్త నిరాశే ఎదురైంది. 

ఎప్పుడెప్పుడా అని ఎదురచూస్తున్న పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఆహా టీమ్ సూపర్ అప్డేట్ ఇచ్చింది. పవర్ స్టార్ ఎపిసోడ్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న అభిమానుల కోసం ఆహా గుడ్ న్యూస్ చెప్పింది. అన్ స్టాపబుల్ లో పవన్ కల్యాణ్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేసింది.

- Advertisement -

నేను అందిరిని నన్ను బాలా అని పిలవమంటాను అని బాలయ్య అనగానే.. దానికి పవర్ స్టార్ నేను ఓడిపోవడానికి సిద్ధం కానీ నన్ను అలా పిలవమనకండి అని అంటుండగానే ఈ పాలిటిక్సే వద్దంటూ బాలయ్య కౌంటర్ ఇచ్చారు. ఈ మధ్య పాలిటిక్స్ లో విమర్శల్లో వాడి వేడి బాగా డబుల్ ఇంపాక్ట్ అయిందని బాలకృష్ణ అనగా.. లేదండి నేను చాలా పద్ధతిగా మాట్లాడుతున్నానని పవన్ కల్యాణ్ బదులిచ్చారు. 

చిరంజీవి నుంచి మీరేం నేర్చుకున్నారు.. ఏం వద్దనుకున్నారు అని బాలయ్య పవన్ ను అడిగారు. మరోవైపు పవన్ కల్యాణ్ తాను ఓ సినిమా గురించి చిరంజీవి భార్య సురేఖకు చెబుతూ.. వదినా నేను ఇదే చివరి సినిమా అనుకుంటున్నాను.. తర్వాత చేయననుకుంటున్నాను అని చెప్పానని చెప్పారు. ఇంతకీ అదేం సినిమానో తెలుసుకోవాలంటే పవర్ స్టార్ ఎపిసోడ్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.

బాలయ్య పవన్ కల్యాణ్ ను.. రాష్ట్రమంతా నీకు అభిమానులే కానీ ఆ అభిమానం ఓట్లుగా ఎందుకు కన్ వర్ట్ కాలేదని మీ ఉద్దేశం అని అడిగారు దీనికి పవన్ కల్యాణ్ సమాధానమేంటో చూడాలి. ఇక ప్రోమో చివరలో బాలయ్య, పవన్ కల్యాణ్ నడుచుకుంటూ వెళ్తూ ఉండగా.. బాలయ్య.. మేం బ్యాడ్ బాయ్స్.. 1..2.3.4.5.6.7.8.9 10 అని చెప్పారు. ఇక ప్రోమో చివర్లో పవన్ వాయిస్ లో వచ్చే మనల్నెవడు భయపెట్టేటోడు అంటూ వచ్చే డైలాగ్ హైలైట్. 

ఈ ప్రోమో చూసిన పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఇక పూనకాలు లోడింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here