Kushi Re-Release : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది.. ఇప్పటికే ఎన్నో సినిమాలు మళ్ళీ రిలీజ్ అయ్యి మంచి హిట్ ను అందుకున్నాయి.. యిప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా కూడా విడుదల కానుంది. ఈ డిసెంబర్ 31 వారిని ఆనందోత్సాహాలతో నింపడం కోసం ఖుషి సినిమా మళ్లీ విడుదల కానుంది. ఈ విషయాన్ని సినిమా దర్శకుడు ఎస్.జే.సూర్య మరోసారి ప్రకటించారు. దీంతో పవన్ అభిమానులు ఒక్కసారిగా ఆనందోత్సవాల్లో మునిగిపోయారు.
ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఖుషి మూవీ ని కూడా మళ్లీ రీ రిలీజ్ చేయడానికి మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ చిత్రం ఏప్రిల్ 27,2001 లో విడుదలై అప్పట్లో రికార్డు కలెక్షన్లు సాధించింది. సరిగ్గా 21 సంవత్సరాలు తర్వాత మళ్లీ రీ రిలీజ్ కాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే చిత్ర యూనిట్ అన్ని సన్నాహాలు చేసింది..ఫ్యాన్స్ లో ఒక బజ్ ను క్రియేట్ చేసింది..అయితే ఈ సినిమా మళ్లీ కలెక్షన్ల వర్షం కురిపిస్తుందని వారు భావిస్తున్నారు.
ఈ చిత్రానికి ఎస్.జే.సూర్య దర్శకత్వం వహించగా పవన్ కళ్యాణ్ హీరోగా, భూమిక హీరోయిన్ గా నటించింది.. రొమాంటిక్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ మూవీకి మణిశర్మ సంగీతం మరో లెవల్ అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని 4కె రిజల్యూషన్ , డాల్బీ ఆడియోతో మళ్లీ రాబోతోంది. ఈ విషయాన్ని దర్శకుడు ఎస్ జె సూర్య సోషల్ మీడియా వేదికగా బయటపెట్టారు.
అభిమానుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఎస్ జె సూర్య ట్విట్టర్ లో ఇలా రాసుకొచ్చారు.. ‘ఏజ్ ఫర్ ఏజ్, యన్ ఓజీ లవ్ సాగా.. ఎవర్ గ్రీన్ రొమాన్స్.. అంటూ రాసుకొచ్చాడు . ఇది చూసిన అభిమానులంతా మరోసారి ఈ ఇయర్ ఎండింగ్ ను ఖుషి సినిమా ని చూసి ముగించాలని కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు…ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా కోసం బుక్ మై షో లో అభిమానులు ఈ సినిమా టికెట్స్ ని బుక్ చేసుకునేందుకు వెతకడం మొదలు పెట్టేసారు..
అలా ఒకేసారి కొన్ని లక్షల మంది బుక్ మై షో లో ఖుషి సినిమా కోసం సెర్చ్ చెయ్యడం వల్ల ‘అవతార్ 2 ‘ సినిమాను కూడా వెనక్కి నెట్టి నెంబర్ 1 స్థానం లో ట్రేండింగ్ అవడం మొదలు పెట్టింది..కేవలం ఒక్క ప్రకటన కి ఈ రేంజ్ లో ఉంటే సృష్టిస్తే ఇక అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైతే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు… మొత్తానికి ఈ సినిమా మరో వండర్ ను క్రియేట్ చెయ్యనుందని తెలుస్తుంది.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రెండు సినిమాలను చేస్తున్నారు..