Singer Sunitha : సింగర్ సునీత భర్త బ్యాగ్రౌండ్ గురించి తెలుసా..ఎంత ఆస్తి ఉందంటే?

- Advertisement -

Singer Sunitha : సింగర్ సునీత గురించి అందరికి తెలుసు.. డబ్బింగ్, యాంకరింగ్, సింగర్ గా ఎంతో మంది మనసును దొచుకుంది.. ఆంద్రాలో పుట్టి పెరిగింది..అయితే ఈమె మొదట టీవీ యాంకర్ గా అందరికి పరిచయం అయ్యింది. ఆ తర్వాత 15 ఏళ్లకే సింగర్గా గుర్తింపు తెచ్చుకుంది. గులాబీ, ఎగిరే పావురమా వంటి సినిమాలలో పాటలు పాడి మంచి పేరు పొందిన ఈమె ఆ తర్వాత డబ్బింగ్ ఆర్టిస్టుగా రాణిస్తూ ఎంతోమంది తెలుగు హీరోయిన్లకు వాయిస్ అందించింది. అలా దాదాపుగా 700 కు పైగా చిత్రాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేసింది సునీత.. మధురమైన గాత్రంతో పాటు, అందంగా ఉండటంతో అప్పటిలో ఆమెకు సినిమాలో నటించే అవకాశాలు కూడా ఎక్కువగానే వచ్చాయి. కానీ ఆమె ఏ ఒక్కదానికి కూడా చెయ్యలేదు..

ఈమె మొదటి భర్త తో మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకుంది. ఇప్పుడు మరో పెళ్లి చేసుకుంది.. వ్యాపారవేత్త రామ్ ను ఇటీవల పెళ్లి చేసుకుంది.. అతని గురించి ఇప్పుడు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అతనికి ఎంత ఆస్తి ఉంది, ఎటువంటి వ్యాపారాలు చేస్తుంటారనేది తాజాగా సంచలనంగా మారింది.. ఆయన ఆస్ట్రేలియాలో పై చదువులు చదివి భారతదేశానికి వచ్చి వ్యాపారవేత్తగా ఎదిగారు.

రామ్ వీరపనేనికి ప్రముఖ కంపెనీలో కొన్ని వందల కోట్ల రూపాయల విలువచేసే షేర్లు ఉన్నాయి. మ్యాంగో మ్యూజిక్ కి సునీత ఎన్నో పాటలు పాడారు. అలా వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. సునీత కోరిక మేరకు మంచి స్నేహితులుగా ఉన్న వీరు దంపతులుగా మారారు.. మొదటి నుంచి సోషల్ మీడియాకి రామ్ వీరపనేని దూరంగా ఉన్నారు. ముఖ్యంగా యూట్యూబ్లో మంచి బ్రాండ్ ఇమేజ్ ఉన్న మ్యాంగో మ్యూజిక్ కి సీఈవో.. తమిళం, హిందీలో బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాల రైట్స్ తీసుకొని యూట్యూబ్ లో పెట్టేవాడు.అలా కుడా ఆయన బాగానే సంపాదిస్తున్నాడు..ఇవే కాదు హైదరాబాదులో పెద్దపెద్ద బిల్డింగ్స్ తో పాటు అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. అలాగే ఆయనకు తన తండ్రి వారసత్వంగా కూడా కొన్ని కోట్లు ఆయనకు వచ్చాయని తెలుస్తుంది..మొత్తంగా చూసుకుంటే కోట్లకు అధిపతి అని తెలుస్తుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here