Bandla Ganesh : పవన్ కళ్యాణ్ భక్తుడిని అంటూ ఇవేమి పనులు బండ్ల గణేష్.. పవన్ ఫ్యాన్స్ ఆవేదన

Bandla Ganesh Tweets


Bandla Ganesh : టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భక్తుడు ఎవరు అని అడిగితే మనకి గుర్తుకు వచ్చే ఇద్దరు ముగ్గురిలో మొదటి వ్యక్తి బండ్ల గణేష్.. ఇండస్ట్రీ లో నిర్మాతగా బండ్ల గణేష్ ఈ రేంజ్ లో ఉన్నదంటే దానికి ప్రధాన కారణం పవన్ కల్యాణే.. నిర్మాతగా మొదటి రెండు సినిమాలైనా ‘ఆంజనేయులు’ ‘తీన్ మార్’ వంటి సినిమాలు ఫ్లాప్ అయ్యినప్పటికీ, మూడవ సినిమా పవన్ కళ్యాణ్ తో తీసిన ‘గబ్బర్ సింగ్’ చిత్రం ఆరోజుల్లో ఒక చరిత్ర సృష్టించింది.

Pawan Kalyan Bandla Ganesh
Pawan Kalyan Bandla Ganesh

నిర్మాతగా బండ్ల గణేష్ రేంజ్ ని శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్లింది, ఆ చిత్రం తర్వాత బండ్ల గణేష్ వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చెయ్యడం ప్రారంభించాడు.. ఇండస్ట్రీ లోనే టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్ గా మారాడు, ఇదంతా జరగడానికి పవన్ కళ్యాణ్ కారణమని, అందుకే ఆయనని నేను దేవుడిలా చూస్తానంటూ చెప్పుకొస్తూ ఉండేవాడు.

Pawan Kalyan unstoppable with nbk

అయితే ఈమధ్య పవన్ కళ్యాణ్ మరియు బండ్ల గణేష్ కి మధ్య కాస్త గ్యాప్ ఏర్పడిందని సోషల్ మీడియా లో రకరకాల వార్తలు వచ్చాయి.. బండ్ల గణేష్ కూడా చాలా సందర్భాలలో త్రివిక్రమ్ వల్లే మా ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడింది అంటూ బహిరంగంగానే తెలిపాడు, అయితే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఆహా మీడియా లో బాలయ్య బాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ టాక్ షోకి ముఖ్య అతిధి గా పాల్గొన్న ఎపిసోడ్ ని ఆహా యాప్ లో అప్లోడ్ చెయ్యగా, ఆ ఎపిసోడ్ కి ఆల్ టైం రికార్డు రేంజ్ రెస్పాన్స్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.. ఈ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ – బాలయ్య మధ్య నడిచిన చిట్ చాట్ అభిమానులను అలరించింది.. అయితే ఈ షో లో బాలయ్య పవన్ కళ్యాణ్ ని అడిగిన ఒక ప్రశ్న సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

బాలయ్య పవన్ ని ఒక ప్రశ్న అడుగుతూ ‘గబ్బర్ సింగ్ సినిమాకి రెమ్యూనరేషన్ ఇచ్చారా నీకు’ అని అడగగా పవన్ కళ్యాణ్ దానికి సమాధానం చెప్తూ ‘నేను అనుకున్న రేంజ్ డబ్బులు అయితే ఇవ్వలేదు కానీ తాను అనుకున్న రేంజ్ డబ్బులు ఇచ్చాడు’ అని నవ్వుతూ చెప్తాడు.. దీనికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో బండ్ల గణేష్ ని బద్నామ్ చేసారు.. మా హీరో కి ఇవ్వాల్సిన బ్యాలన్స్ ఇచ్చేయమంటూ ఫ్యాన్స్ బండ్ల గణేష్ ని ట్యాగ్ చేసి అడుగుతారు.. దానికి బండ్ల గణేష్ చాలా కోపం రియాక్ట్ అవుతూ ‘తెలిసీ తెలియకుండా మాట్లాడుకు రా ఎర్రి..’ అంటూ రిప్లై ఇస్తాడు..

అప్పుడు మళ్ళీ ఆ అభిమాని ‘హీరోనే చెప్తున్నాడు నువ్వు డబ్బులు ఇవ్వలేదని.. ముందు ఆయనకీ ఇచ్చేయి, తర్వాత మనం కొట్టుకుందాం’ అని అంటాడు. .అప్పుడు బండ్ల గణేష్ దానికి మళ్ళీ రియాక్ట్ అవుతూ ‘నేను నోరు తెరిస్తే గుండె ఆగి చస్తావ్’ అని సమాధానం ఇస్తాడు.

బండ్ల గణేష్ ఇచ్చిన ఆ రిప్లై సెన్సేషనల్ గా మారింది.. ఆ తర్వాత ఎవరో దురాభిమాని బండ్ల గణేష్ ని ట్యాగ్ చేస్తూ ‘చూసారా సార్..మీరు పవన్ కళ్యాణ్ కి అంత గౌరవం ఇస్తారు, ఆయనేమో మీ గురించి ఒక పాపులర్ టాక్ షో ఇలా మాట్లాడాడు’ అని అనగా బండ్ల గణేష్ దానికి రిప్లై ఇస్తూ ‘ఇక నుండి కూడా నా విశ్వరూపం చూస్తారు’ అంటూ సమాధానం ఇచ్చాడు..ఇక ఆ తర్వాత అభిమానులు ‘పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పుకుంటూ ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం ఏమాత్రం కరెక్ట్ కాదు,నీ గురించి అక్కడ తక్కువ గా ఏమి మాట్లాడలేదు, నువ్వు డబ్బులివ్వలేదని చెప్పలేదు..

గబ్బర్ సింగ్ సమయం లో చెప్పినట్టు గానే ఇస్తా అన్నది ఇచ్చాడు అని మాత్రమే చెప్పాడు.. తప్పుగా అర్థం చేసుకొని నువ్వు కూడా విషసర్పం లాగ మారొద్దు’ అని అభిమానులు అంటారు.. అప్పుడు బండ్ల గణేష్ అర్థం చేసుకొని ‘ఐ లవ్ పవన్ కళ్యాణ్ సర్’ అని మరో బండ్ల గణేష్ ట్వీట్ వేసాడు.. ఇలా నిమిషాల వ్యవధి లో బండ్ల గణేష్ లో వచ్చిన మార్పులు చూసి అభిమానులతో పాటుగా నెటిజెన్స్ కూడా షాక్ కి గురయ్యారు.