Actress Archana : ఆ హీరోల గురించి పచ్చి నిజాలను బయట పెట్టిన అర్చన.. వీడియో వైరల్..

- Advertisement -

Actress Archana : తెలుగు చిత్ర పరిశ్రమలో నటి అర్చన గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆమె చేసిన కొన్ని సినిమాలే మంచి టాక్ ను అందించాయి.. అతి తక్కువ కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నా కూడా హీరోయిన్ గా రాణించలేక పోయింది. దాంతో సెకండ్ హీరోయిన్ గా మిగిలిపోయింది.. ఏమందో గానీ సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసి పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది.. తాజాగా ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది.. హీరోల గురించి పచ్చి నిజాలను బయట పెట్టింది. అది కాస్త నెట్టింట చర్చనీయాంశంగా మారింది..

కొంతమంది హీరోల గురించి మాట్లాడుతూ అర్చన ఈ విషయాలను చెప్పుకొచ్చారట.. రాధా గోపాళం మూవీలో ఛాన్స్ మిస్సైందని ఒక సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయడం వల్ల నాకు హీరోయిన్ ఛాన్స్ పోయిందని అర్చన చెప్పుకొచ్చారు. ఆ సినిమాలో నటించి ఉంటే నా గ్రాఫ్ అద్భుతంగా ఉండేదని అర్చన పేర్కొన్నారు.

Actress Archana
Actress Archana

కొంతమంది క్యారెక్టర్ల్ ఆర్టిస్ట్ గా చేసి హీరోగా సక్సెస్ అయ్యారని నేను మాత్రం అలా కాలేదని ఆమె తెలిపారు. తెలుగు వాళ్లు నేను ఎక్కడికి వెళ్లినా కూడా నాకు ఇంకా ఆఫర్లు రావాలని చెబుతున్నారని అర్చన చెప్పుకొచ్చారు. యమదొంగలో ఛాన్స్ వస్తే నేను చాలా ఆనందించాను.

- Advertisement -

యమదొంగ మూవీ నాకు చాలా ప్లస్ అయిందని అర్చన కామెంట్లు కూడా చేశారు. ప్రస్తుతం వెరైటీ రోల్స్ అయితే వస్తున్నాయని అర్చన అన్నారట. రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర నాకు బాగా నచ్చిందని ఆమె తెలిపారు. ఒక అమ్మాయి వీక్ గా ఉంటే ఆ అమ్మాయి మైండ్ క్యాప్చర్ చేయడానికి ఎంతో మంది ఉంటారు..నా జీవితంలో ఒక షాకింగ్ ఘటన వెలుగు చూసింది.. ఓ హీరో ఒక హీరో నాకు తెలీకుండా నా గురించి కొన్ని స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారని ఆమె పేర్కొన్నారు.

ఆ హీరోది వంకరబుద్ది అని అర్చన తెలిపారు.. ఆ హీరోనే కాదు ఇండస్ట్రీలో చాలామంది హీరోలు అలానే ఉన్నారంటూ పచ్చి నిజాలను బయటపెట్టింది.. ఎవరి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీ లో అందంగా ఉన్న అమ్మాయిల ను కొంతమంది హీరోలు ట్రాప్ చేస్తారని అర్చన చెప్పుకొచ్చారు.. మనకు ఏది మంచి.. ఏది చెడు అనేది మనకే తెలుస్తుందని అర్చన పేర్కొన్నారు. నాకు తల్లీదండ్రుల సపోర్ట్ బాగా ఉందని అర్చన తెలిపారు. అర్చన వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.. మరి ఆమె వ్యాఖ్యల వల్ల సినిమాలో అవకాశాలు ఇస్తారో లేదో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here