Umair Sandhu : హీరోయిన్ రష్మికతో అల్లు అర్జున్ రహస్య డేటింగ్.. సంచలన నిజాలు బయటపెట్టిన బాలీవుడ్ క్రిటిక్

- Advertisement -

Umair Sandhu : ఈమధ్య కాలం లో సోషల్ మీడియా వల్ల వచ్చే ఉపయోగాలకంటే కూడా నష్టాలే ఎక్కువ ఉంటున్నాయి.కొంతమంది స్టార్ హీరోల వ్యక్తిగత జీవితాల్లో దూరి లేని పోనీ పుకార్లు పుట్టించి సోషల్ మీడియా లో ఫేమస్ అయిపోవాలని చూస్తున్నారు కొంతమంది దుర్మార్గులు.అలాంటి వారి లిస్ట్ లో ముందు ఉంటాడు ఉమర్ సందు.ఇతను ట్విట్టర్ లో బాలీవుడ్ క్రిటిక్ గా పేరు తెచ్చుకున్నాడు.

Umair Sandhu
Umair Sandhu

ఒకప్పుడు ఇతగాడు సినిమాలు విడుదల అవ్వకముందే సూపర్ హిట్ రిపోర్ట్స్ చెప్పి అటెన్షన్ ని గ్రాబ్ చెయ్యడానికి చూసేవాడు, అవన్నీ అబద్దాలు అని జనాలు కనిపెట్టేయడం తో, ఇతగాడు రూట్ మార్చాడు.స్టార్ హీరోలకు ప్రముఖ హీరోయిన్స్ కి అఫైర్స్ ఉన్నాయంటూ లింక్ పెడుతూ సోషల్ మీడియా లో పోస్టులు వేసి రచ్చ రచ్చ చేస్తున్నాడు.ప్రభాస్ మరియు కృతి సనన్ కి నిశ్చితార్థం జరిగిపోయింది అంటూ ప్రచారం చేసింది ఈయనే.ఈ వార్త ఇండియా మొత్తాన్ని షేక్ చేసింది.

ఆ తర్వాత సోషల్ మీడియా లో ఇతని ఆగడాలకు హద్దే లేకుండా పోయింది,వరుసగా ఇలాంటి పుకార్లు పుట్టించడం ప్రారంభించాడు. చివరికి పెళ్ళైన వాళ్ళని కూడా ఇతగాడు వదలడం లేదు,రీసెంట్ గా ఈయన ట్విట్టర్ లో పెట్టిన పోస్టు ఒకటి సెన్సేషనల్ గా మారింది.స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు ప్రముఖ స్టార్ హీరోయిన్ డేటింగ్ లో ఉన్నారని, త్వరలోనే అల్లు అర్జున్ స్నేహ రెడ్డి కి విడాకులు ఇచ్చేసి , రష్మిక ని పెళ్లాడబోతున్నాడని ఒక ట్వీట్ పెట్టాడు.

- Advertisement -

దీనికి ఫ్యాన్స్ నుండి చాలా ఘోరమైన తిట్లు ప్రారంభమయ్యాయి.అయినా ఇతగాడికి సిగ్గు ఉంటే కదా, తిడితే తిట్టారు నాకు పాపులారిటీ వస్తే చాలు అని అనుకున్నాడు. ఇతని పై సైబర్ క్రైమ్ కేసు పెట్టొచ్చు, కానీ ఇతగాడు ఉండేది దుబాయ్ లో, అందుకే ఇతని నోటికి తాళం వేయలేకపోతున్నారు ఎవ్వరూ కూడా. రాబొయ్యే రోజుల్లో అయినా ఇతని నోటిని ఎవరైనా ముయ్యిస్తే బాగుండును.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here