సముద్రఖని తో పవన్ కళ్యాణ్ మరో సినిమా.. ఇదేమి టార్చర్ అండీ బాబోయ్ అంటున్న ఫ్యాన్స్

- Advertisement -

ఒకప్పుడు దర్శకుడిగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తీసి తమిళ టాప్ డైరెక్టర్స్ లో ఒకడిగా నిలిచాడు ప్రముఖ దర్శకుడు సముద్ర ఖని. ఆ తర్వాత ఆయన కొన్నాళ్ళకు క్యారక్టర్ ఆర్టిస్టుగా గా కూడా అడుగుపెట్టి సౌత్ లోనే మోస్ట్ డిమాండ్ ఉన్న క్యారక్టర్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నాడు, ఇప్పుడు ఈయన లేని సినిమా అంటూ లేదంటే ఏమాత్రం అతి సయోక్తి లేదు.

తెలుగు లో ఈయన రవితేజ మరియు అల్లరి నరేష్ ని పెట్టి ‘శంభో శివ శంభో’ అనే సినిమా తీసాడు. ఈ చిత్రం కమర్షియల్ గా పెద్దగా ఆడకపోయినా, సముద్ర ఖని కి మాత్రం మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. ఈ సినిమా తర్వాత మళ్ళీ ఆయన చాలా సంవత్సరాలకు పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న ‘బ్రో ది అవతార్’ చిత్రానికి దర్శకత్వం వహించే ఛాన్స్ దక్కింది, ఈ సినిమా వచ్చే నెల 28 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇందులో పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో నటిస్తున్నాడు, కేవలం 30 రోజుల్లో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసి పవన్ కళ్యాణ్ ని సైతం ఆశ్చర్యపోయేలా చేసాడు సముద్ర ఖని. రీసెంట్ గానే ఈ సినిమా ఔట్పుట్ ని చూసిన పవన్ కళ్యాణ్, సముద్ర ఖని పట్ల ఎంతో సంతోషాన్ని వ్యక్తపరిచాడట. అతని పని తనం ని చూసి ఇష్టపడిన పవన్ కళ్యాణ్ వెంటనే మరో సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచేసినట్టు సమాచారం.

- Advertisement -

ఈ సినిమా పూర్తి స్థాయి కమర్షియల్ చిత్రం గా తెరకెక్కిస్తున్నారట,అలాగే తమిళం లో కూడా అక్కడి స్టార్ హీరో విజయ్ తో త్వరలోనే ఒక సినిమా చేయబోతున్నట్టు సమాచారం. ఇలా మరోసారి ఆయన డైరెక్టర్ గా క్రేజీ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ గా మారబోతున్నట్టుగా అర్థం అవుతుంది. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం సముద్ర ఖని తో మరో సినిమా చెయ్యడం పట్ల అసంతృప్తి తో ఉన్నారు. తన తోటి స్టార్ హీరోలందరూ వరుసగా పాన్ ఇండియన్ సినిమాలు చేస్తుంటే పవన్ కళ్యాణ్ ఇలా కేవలం రీజనల్ చిత్రాలకు పరిమితం అవ్వడం నచ్చడం లేదని అంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here