Paruchuri Gopalakrishna : ‘ధమాకా’లో ఆ సీన్ చీటింగ్ షార్ట్.. పరుచూరి సెన్సేషనల్ కామెంట్స్

- Advertisement -

Paruchuri Gopalakrishna : మాస్ మహారాజ రవితే.. బబ్లీ గర్ల్ శ్రీలీల కలిసి నటించిన యూత్​ఫుల్ ఎంటర్​టైనర్ ధమాకా. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్‌లో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్​ మామూలుగా షేక్ చేయలేదు. రవితేజను ఏకంగా వంద కోట్ల క్లబ్​లో చేర్చింది. శ్రీలీలకు వరుస అవకాశాలు వచ్చేలా చేసింది.

Paruchuri Gopalakrishna
Paruchuri Gopalakrishna

ఈ మూవీలో రవితేజ స్టైల్, యాక్షన్, నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక శ్రీలీల గ్లామర్.. నటనతో తెలుగు కుర్రాళ్లను కట్టిపడేసింది. ఈ మూవీలో రావు రమేశ్-హైపర్ ఆది మధ్య వచ్చే సన్నివేశాలు చాలా సరదాగా కలిసిపోతుంటాయి. చాలా ఫన్​గా ఉంటాయి కూడా. యాక్షన్, ఎమోషన్, రొమాన్స్ అన్ని సమపాళ్లలో కలిసి ప్రేక్షకుడికి మంచి విందునిచ్చిన ఫీల్ కలిగించింది ధమాకా మూవీ.

తాజాగా ఈ బ్లాక్ బస్టర్​పై సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ మూవీలో రవితేజ నటనను.. డైరెక్టర్ టేకింగ్​ను మెచ్చుకుంటూనే కొన్ని సీన్లు చీటింగ్ షార్ట్స్​అని కామెంట్స్ చేశారు. ఇంకా పరుచూరి ధమాకా సినిమా గురించి ఏమేం చెప్పారో చూద్దామా..?

- Advertisement -

‘‘తన తండ్రి కాని తండ్రి ఆస్తిని లాక్కోవాలని చూసే విలన్‌ పని పట్టిన ఓ హీరో కథ ఈ చిత్రం. ఈ సినిమాలో రావు రమేశ్‌, శ్రీలీల పాత్రలు చూస్తే పర్‌ఫెక్ట్‌ క్యారెక్టరైజేషన్‌ అనేది అవసరం లేదని చెప్పడానికి సరైన ఉదాహరణలుగా అనిపించాయి. రచయిత ఎలాంటి కష్టం లేకుండా ఈ పాత్రలను సృష్టించాడు. రావురమేశ్‌ పక్కన హైపర్‌ ఆదిని పెట్టారు. వాళ్లిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు అలా సరదాగా సాగిపోతూ ఉంటాయి.

హీరోని ఓ వ్యక్తి తలపై కొడితే అతడు కిందపడిపోవడంతో కథ మొదలవుతుంది. సాధారణంగా ఒక మాస్‌ హీరోకి ఇలాంటి ప్రారంభ సన్నివేశాలు ఉండవు. కానీ, దర్శకుడు సాహసోపేతంగా ఓపెనింగ్ షార్ట్‌ తెరకెక్కించాడు. ఎక్కడ సస్పెన్స్‌ ఉంటుందో.. అక్కడ సెంటిమెంట్‌ పండదనే సూక్తిని దర్శకుడు బాగా నమ్మాడు. అందుకే సినిమాలో ఉన్నది ఇద్దరు రవితేజలు కాదు ఒక్కరే అనే విషయాన్ని ఆయన ఇంటర్వెల్‌కు ముందే తోటి ఆర్టిస్టులకు తప్ప ఆడియన్స్‌కు అర్థమయ్యేలా నిజం చెప్పేశాడు. ఇది చేయబట్టే ఈ సినిమా రూ.40 కోట్ల బడ్జెట్‌తో తీస్తే రూ.110 కోట్ల వసూళ్లు రాబట్టిందని సినీ విశ్లేషకుల అంచనా. అంటే రూపాయికి రూపాయిన్నర లాభం వచ్చినట్టే.

సినిమాని తెరకెక్కించిన విధానం చూస్తే ప్రేక్షకులతో ఆ దర్శకుడు, రచయితలు ఆడుకున్నారనిపించింది. ఒక్క క్షణం అలా కంటిచూపు తిప్పితే కథను మిస్‌ అయిపోతామనే భయాన్ని స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకుల్లో క్రియేట్‌ చేశారు. దర్శకుడి ప్రతిభకు రవితేజ నటన తోడు కావడంతో సినిమా అద్భుతంగా వచ్చింది. అందుకు రవితేజకు హ్యాట్సాఫ్‌ చెప్పాలి. అయితే ఈ చిత్రాన్ని మనం ఇంట్లో సోలోగా చూస్తే ఇదేం పెద్ద గొప్ప సినిమాగా అనిపించదు. థియేటర్‌లో నలుగురితో కలిసి చూస్తే ఈ సినిమా మరింత ఎక్కువ సంపాదించి ఉండాల్సింది కదా అనిపిస్తుంది.

ఇందులోని ఓ సన్నివేశంలో రావు రమేశ్‌.. రవితేజను చూసి దండం పెడతాడు. ఆ సీన్‌ చూస్తే మేము రాసిన ‘సమర సింహారెడ్డి’, ‘ఇంద్ర’ సినిమాలు గుర్తుకు వచ్చాయి. అది నాకు చీటింగ్‌ షార్ట్‌లా అనిపించింది (నవ్వులు). అంతేకాకుండా రావు రమేశ్‌ పాత్ర తీరు కాస్త అయోమయంగా అనిపించింది. మిగతా పాత్రలు బాగున్నాయి. క్లైమాక్స్‌ మనసుని హత్తుకునేలా ఉంది. అన్యాయంగా ఇంకొకరి సొమ్మును కాజేయవద్దనే సందేశాన్ని ఈ సినిమాతో దర్శకుడు ప్రపంచానికి అందించారు’’ అని పరుచూరి తెలిపారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here