అనే ఆనవాయితీకి స్వస్తి పలికింది. ఇండియన్ సినిమాలు ఏమాత్రం తీసిపోవని ప్రూవ్ చేసింది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ వేదికగా జరుగుతున్న 95వ ఆస్కార్ అవార్డుల వేడుకలో భారతీయ సినిమా తన పవర్ చూపించింది.

అమెరికా గడ్డపై జరుగుతున్న ఆస్కార్ వేడుకల్లో తెలుగు సినిమా సంచలనం సృష్టించింది. ప్రపంచ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుగా భావించే ఆస్కార్ పురస్కారాన్ని అందుకుంది తెలుగు చిత్రం RRR. 95వ ఆస్కార్ అవార్డుల వేడుకలో ఈ చిత్రంలోని నాటునాటు పాటకు ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్ వరించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ దక్కించుకుంది. ఆస్కార్‌ను దక్కించుకున్న తొలి భారతీయ గీతంగా నాటు నాటు రికార్డులకు క్రియేట్ చేసింది. హాలీవుడ్ పాటలను తలదన్ని చివరకు వరకు చేరిన నాటు నాటు 95వ అకాడమీ పురస్కారాల్లో విజయకేతనం ఎగరవేసింది.
ఈ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి కుమారుడు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ఈ పాటను చంద్రబోస్ రచించగా.. కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. నాటు నాటు పాటకు ఎన్టీఆర్, రామ్‌చరణ్ అదిరిపోయే స్టెప్పులు వేశారు. దీనికి ప్రేమ్‌రక్షిత్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ప్రముఖ దర్శకుడు ఎస్. ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్ ఆవార్డులు సాధించింది.

అంతకుముందు ఆస్కార్ వేదికపై నాటు నాటు లైవ్ పర్ఫామెన్స్ జరిగింది. డాల్బీ థియేటర్లో ఆస్కార్ వేదికపై రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ్ లైవ్‌లో ఈ పాటను పాడగా.. విదేశీ డ్యాన్సర్లు స్టెప్పులేశారు. ఈ పాట పూర్తవ్వగానే థియేటర్లోని తారలంతా తమ సీట్లలోంచి లేచి మరీ చప్పట్లు కొట్టారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా టీమ్ అయితే చిన్నపిల్లల్లా కేరింతలు కొట్టారు. తారల కరతాళ ధ్వనులతో డాల్బీ థియేటర్ మార్మోగింది.
ఈ పాటను బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకోన్ ఆస్కార్ వేదిక మీదుగా ఇంట్రడ్యూస్ చేశారు. ఈ పాట స్టోరీని అందరికీ వివరించారు. “ఉర్రూతలూగించే కోరస్.. దుమ్మురేపే బీట్స్.. కిల్లర్ డ్యాన్స్ మూవ్స్ నెక్స్ట్ వచ్చే పాటను గ్లోబల్‌గా పాపులర్ చేశాయి. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఓ కీలక సీన్లో ఈ పాట వస్తుంది. భారతీయ పోరాట యోధులు కొమురంభీం, అల్లూరి సీతారామ రాజుల మధ్య ఉన్న స్నేహబంధాన్ని ఈ సినిమాలో చూపించారు.
ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ పాట రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు యూట్యూబ్, టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో లక్షల కోట్ల వ్యూస్ సంపాదించింది. ఇప్పుడు ఏకంగా ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన మొట్టమొదటి ఇండియన్ సాంగ్‌గా చరిత్ర సృష్టించింది. మీకు నాటు గురించి తెలుసా..? ఒకవేళ తెలియకపోతే ఇప్పుడు తెలుస్తుంది. ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి ఇప్పుడు నాటు నాటు పాట లైవ్ పర్ఫామెన్స్ రాబోతోంది. చూసి ఎంజాయ్ చేయండి.” అంటూ ఆస్కార్ వేదికపై దీపికా పడుకోన్ నాటు నాటు పాటను ఇంట్రడ్యూస్ చేశారు.
Award winning moments for #RRRMovie Team #NaatuNaatuWinsOscar#Oscar #Oscars95pic.twitter.com/STc3dN3SF5
— Vamsi Kaka (@vamsikaka) March 13, 2023