NTR 30 : జూనియర్ ఎన్టీఆర్ త్రిపుల్ ఆర్ సినిమాతో మంచి క్రేజ్ ను అందుకోవడం తో పాటు.. పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ప్రస్తుతం ఆయన మాస్ డైరెక్టర్ కొరటాలా శివ దర్శకత్వం లో సినిమాను చేస్తున్నాడు.ఆ సినిమా గురించి అనౌన్స్ చేసాడు.. ఇప్పుడు ఎన్టీఆర్ 30 వ సినిమా కథ ఇదే నంటూ ఓ వార్త ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది. టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం అవుతుంది. మరి ఆ కథ ఏమిటో పూర్తిగా తెలుసుకుందాం..

ఎన్టీఆర్ ఫ్యాన్స్ పూర్తి నిరాశలో ఉన్నారు. వారి అసహనం అమిగోస్ ప్రీ రిలీజ్ వేదికగా బయటపడింది. ఎన్టీఆర్ 30 అప్డేట్ కావాలంటూ నానా హంగామా చేశారు. ఎన్టీఆర్ కూడా సహనం కోల్పోయేలా వారి అల్లరి సాగింది. కొరటాల శివ మూవీ అప్డేట్ ఇస్తూనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.. తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి వెళ్ళింది.
కాబట్టి మేము ఇంకా కష్టపడాల్సి ఉంది. నాణ్యమైన చిత్రాలు తెరకెక్కించాల్సిన బాధ్యత పెరిగింది. ఒక సినిమా తీయడం ఆషామాషీ కాదు. కీలకమైన అప్డేట్ ఉంటే భార్య కంటే కూడా ముందు మీకే చెప్తాము. కాబట్టి అప్డేట్ కావాలంటూ మేకర్స్ మీద ఒత్తిడి తేవద్దు. నా అభిమానులకే కాదు, ప్రతి హీరో అభిమానికి నేను చేసే రిక్వెస్ట్ ఇది, అని ఎన్టీఆర్ సీరియస్ అయిన విషయం తెలిసిందే..

ఇక ఈ సినిమా ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలు జరుపుకోనుంది. మార్చి 20లోపు రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఇక సినిమా 2024 ఏప్రిల్ 5న విడుదల అవుతుందని చెప్పుకొచ్చారు.. గతంలో ఎన్టీఆర్ సినిమా సినిమాకు చాలా గ్యాప్ వస్తుందని తెలిసిందే.. ఇప్పుడు సినిమా పై ఒక వార్త తెరపైకి వచ్చింది.టాలీవుడ్ వర్గాల విశ్వసనీయ సమాచారం ప్రకారం… ఒక కల్పిత ఐలాండ్ లో కథ నడుస్తుందట.
అలాగే సీపోర్ట్ బ్యాక్ డ్రాప్ కలిగి ఉంటుందట. సెమీ పీరియాడిక్ కథ అట. మదర్ నేచర్ వంటి సామాజిక కోణాన్ని కూడా జోడించి కొరటాల తెరకెక్కిస్తున్నారట. ఇక రెండు చేతులలో ఆయుధాలు పెట్టుకొని ఎన్టీఆర్ సముద్ర తీరంలో నిలబడి ఉన్నాడు. సీపోర్ట్ పోస్టర్ లో కనిపిస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్ కి కూడా భారీగా ఖర్చు చేయనున్నారట. భారతీయ ప్రధాన భాషలతో పాటు జపాన్, చైనీస్ భాషల్లో కూడా విడుదల చేస్తారట.. ఏకంగా 9 భాషల్లో ఈ సినిమా విడుదల అవుతుందని సమాచారం..