NTR 30 : ఎన్టీఆర్ 30 సినిమా ఫైట్ సీక్వెన్స్ షురూ.. పునకాలు లోడింగ్..

- Advertisement -

NTR 30 : జూనియర్ ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.. మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో మరో చిత్రం రానున్న సంగతి తెలిసిందే.. ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా రూపొందుతోంది.. అయితే ఈ సినిమా నుంచి ఇంతవరకు అప్డేట్ రాలేదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తుండగా.. ఇటీవల కళ్యాణ్ రామ్ అమీగోస్ ప్రీ రిలీజ్ ఎన్టీఆర్ తన ఫ్యామిలీ గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే..

NTR 30
NTR 30

ఎన్టీఆర్ 30 సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈనెల చివరి వారంలో ప్రారంభం కానుంది.. కాగా ఈ సినిమా షూటింగ్ లో భాగంగా.. ముందుగా బీచ్ సెటప్ వేసి అందులో యాక్షన్ సీక్వెన్స్ సీన్స్ ను చిత్రీకరించనున్నారు. ఈ బీచ్ సెట్ ను అత్యంత భారీ బడ్జెట్ తో వేయించారట.

ఈ సెట్లో తీసే యాక్షన్ సీన్స్ సినిమాకి హైలెట్ గా నిలవనున్నాయని టాక్.. ఈ యాక్షన్ సన్నివేశాలను థియేటర్స్ లో ప్రేక్షకులు చూస్తే పూనకాలు రావడం ఖాయమని సినీ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సెట్ లో తీసి యాక్షన్ సీన్స్ సినిమాకి అత్యంత కీలకమని.. ఈ సినిమా కథను ఈ యాక్షన్ సీన్స్ మలుపు తిప్పుతాయని తెలుస్తుంది.

- Advertisement -

ఈ సినిమా షూటింగ్ భారీగా వేసిన బీచ్ సెటప్ నుంచి తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు కొరటాల శివ అద్భుతమైన కథ రాసుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ గ్రాఫ్ అమాంతం పెరుగుతుందని సమాచారం. ఎన్టీఆర్ 30 సినిమా ముందుగా అనుకున్నట్లుగానే 2024 ఏప్రిల్ 5న విడుదల కానుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here