టాలివుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో, ఎడిటర్ గ్యారీ బీహెచ్ తెరకెక్కుతున్న చిత్రం స్పై. ఈ సినిమాలో ఐశ్వర్య మేనన్ కథానాయికగా నటిస్తోంది.. గత కొద్దిరోజులుగా హిట్ సినిమాలేని హీరోకు కార్తికేయ 2 సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్ ను ఇచ్చింది.. యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు.
ఇటీవలే నిఖిల్ నటించిన కార్తికేయ 2 చిత్రం రిలీజ్ అయ్యి భారీ ను సొంతం చేసుకుంది. చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ. పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకులను ఫిదా చేసింది. అయితే ఇప్పుడు అదే ఫామ్ ను కొనసాగిస్తూ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. గతంలో 18 పేజీస్ సినిమాతో లవర్ బాయ్ గా వచ్చిన ఈ హీరో ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాడు..
అందుకే మళ్ళీ తనకు బాగా కలిసొచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ నే నమ్ముకొని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పుడు “స్పై” గా ఆడియన్స్ ముందుకు రానున్న నిఖిల్.. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.. ఈ సినిమా విడుదలకు తక్కువ రోజులు ఉండటం తో ప్రమోషన్స్ లో జోరు పెంచారు.. వరుసగా ప్రెస్ మీట్స్ ను పెడుతూ సినిమా పై హైప్ ను పెంచుతున్నారు.. ఈ క్రమంలో తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంటి ఫ్యాన్స్ కు వార్నింగ్ ఇచ్చాడు..
ఈ సినిమా అందరి నోర్లు మూయిస్తుంది అంటూ కౌంటర్స్ ఇచ్చాడు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు సంబంధించిన సీక్రెట్ ను రివీల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నటు తెలుస్తుంది. దీనికి తగ్గట్టుగానే టైటిల్ లోగోను కూడా డిజైన్ చేశారు..
కాగా తాజాగా ఈ మూవీ టీజర్ ని ఢిల్లీలోని కర్తవ్య పథ్ నేతాజీ విగ్రహం వద్ద లాంచ్ చేశారు. ఒకటిన్నర నిమిషాల నిడివి కలిగిన ఈ టీజర్.. యాక్షన్, సస్పెన్సు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సాగింది. టీజర్ లోనే కథపై హింట్ ఇచ్చేశారు దర్శకుడు. 1945లో కనపడకుండా పోయిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ చుట్టూ స్పై మూవీ నడుస్తుందని తెలుస్తుంది.
సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో చనిపోయాడు అంటూ మనం చదువుకున్నాం. అయితే ఒక కవర్ స్టోరీ అని, అసలు నిజం ఈ సినిమాతో చెబుతాం అంటున్నాడు నిఖిల్. టీజర్ చూస్తుంటే.. సినిమాలో ఓ రేంజ్ యాక్షన్ ఉన్నట్లు చూపించారు.. మరి సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..