యువతను రెచ్చగొడుతున్న హాట్ యాంకర్ అనసూయ .. డబ్బుల కోసమే ఇదంతా చేస్తుందా?

- Advertisement -

అనసూయ బుల్లితెరపై తన హవాను కొనసాగిస్తున్న యాంకర్స్ లో సుమ తర్వాత వినిపించే పేరు యాంకర్ అనసూయ.. ఒకవైపు వరుసగా సినిమాలు కూడా చేస్తూ కెరియర్ ను బిజీగా గడుపుతుంది.. రంగమ్మత్తగా అందరిని తన నటనతో ఆకట్టుకున్న అమ్మడు నెగిటివ్ షెడ్స్ లలో కనిపించింది..పుష్ప`, `దర్జా`లో నెగటివ్‌ రోల్స్ చేసింది. మరోవైపు ఐటైమ్‌ సాంగులు కూడా చేసింది. కానీ ఇప్పుడు బోల్డ్ రోల్‌లో మెరవబోతుంది. `విమానం` చిత్రంలో అనసూయ బోల్డ్ రోల్‌ చేస్తుందట. ఇందులో ఆమె సుమతి పాత్రలో కనిపించబోతుందని తాజాగా చిత్ర బృందం తెలిపింది.. అందుకు సంబందించిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది..

అనసూయ
అనసూయ

సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్న `విమానం` సినిమాలో అనసూయ కీలక పాత్ర పోషిస్తుంది. మాస్టర్‌ ధ్రువన్‌, మీరా జాస్మిన్‌, రాహుల్‌ రామకృష్ణ, ధన్‌రాజ్‌, రాజేంద్రన్‌ ఇతక ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాతో మీరా జాస్మిన్‌ మరోసారి తెలుగు ఆడియెన్స్ ను అలరించబోతున్నారని చెప్పొచ్చు. శివ ప్రసాద్‌ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్‌, కిరణ్‌ కొర్రపాటి క్రియేటివ్‌ వర్క్స్ పతాకాలపై `విమానం` చిత్రం తెరకెక్కుతుంది. మే15 సోమవారం అనసూయ పుట్టిన రోజు… ఈ సందర్భంగా ఈ చిత్రం నుంచి అనసూయ పాత్రని రివీల్‌ చేసింది యూనిట్‌…మానవ జీవితంలో ఒక్కొక్కరికీ ఒక్కో కథ ఉంటుంది. ప్రతీ కథలోనూ హృదయాలను కదిలించే భావోద్వేగం ఉంటుంది. అలాంటి సుమతి అనే ఓ ఎమోషనల్ అండ్ బోల్డ్ క్యారెక్టర్‌లో మెప్పించనుంది అనసూయ..

సోమవారం అనసూయ భరద్వాజ్ బర్త్ డే సందర్భంగా `విమానం` మూవీ మేకర్స్ సుమతి పాత్రకు సంబంధించి గ్లింప్స్‌ను విడుదల చేశారు. అందులో ఆమె అందంగా రెడీ అవుతుంది. అసలు ఆమె అలా రెడీ అవ్వడానికి గల కారణాలేంటి? అనే విషయాలు తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్‌.. ఈ వీడియో వైరల్ కావడంతో రకరకాల కామెంట్స్ ను అందుకుంటుంది.. ఇలా చేస్తూ యువతను రెచ్చగొడుతుందని, డబ్బుల కోసం ఇంతలా దిగజారాల అంటూ కొందరు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.. ఇక జూన్ 9న ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.. ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here