Neha Sharma : జిమ్​వేర్​లో హాట్ బ్యూటీ నేహా శర్మ వీడియో వైరల్

- Advertisement -

Neha Sharma : చిరుత సినిమాలో హీరోయిన్ గుర్తుంది కదా మీకు. అదేనండి నేహా శర్మ. ఆ తర్వాత వరుణ్ సందేశ్​తో కుర్రాడు సినిమాలో కనిపించింది. ఇక అంతే ఆ సినిమా తర్వాత మళ్లీ తెలుగు తెరపై ఆ బ్యూటీ జాడ లేదు. కానీ బాలీవుడ్​లో మాత్రం అప్పుడప్పుడు సినిమాలు, సిరీస్​లు చేస్తూ ఉంటుంది. ఈ భామ ప్రస్తుతం ముంబయిలోనే స్థిరపడింది.

Neha Sharma :
Neha Sharma

నేహా శర్మ బాలీవుడ్​లో డజనుకుపైగా సినిమాల్లో నటించింది. తుమ్ బిన్-2, సోలో(మలయాళం), తానాజీ, క్రూక్, జయంతా భాయి కీ లవ్ స్టోరీ, యంగిస్థాన్, ముబారకన్, యమ్లా పాగల్ దీవానా-2, ఆఫత్ ఏ ఇష్క్ వంటి సినిమాల్లో నటించింది. ఇల్లీగల్ అనే వెబ్ సిరీస్​లోనూ ఈ బ్యూటీ సందడి చేసింది. ఈ సిరీస్ వూట్​లో రిలీజ్ అయి రెండు సీజన్లుగా వచ్చింది. ఈ సిరీస్​తో నేహా శర్వ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

నేహా సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో ఫేమస్. ఈ బ్యూటీ సోషల్ మీడియా మొత్తం హాట్​నెస్​తో నిండిపోయి ఉంటుంది. హాట్ హాట్ పోజులతో పొట్టి పొట్టి దుస్తుల్లో క్లీవేజ్ షోతో పరువాల విందు చేస్తుంటుంది ఈ భామ. ఈ బ్యూటీ ఫొటోషూట్స్​కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.

- Advertisement -

ముఖ్యంగా నేహా శర్మ అంటే కుర్రాళ్లు పడి చస్తారు. ఈ బ్యూటీ ఫిజిక్​కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. పర్ఫెక్ట్ ఫికర్ మెయింటైన్ చేస్తూ వీలైనంత స్కిన్ షో చేస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తూ ఉంటుంది ఈ భామ. నేహాశర్మకు ఐషా శర్మ అనే సిస్టర్ కూడా ఉంది. అందంలో ఐషా అక్కకు ఏ మాత్రం తీసిపోదు. తరచూ ఈ ఇద్దరు జిమ్​కు వెళ్తు కనిపిస్తారు.

ఎక్కువగా నేహా శర్మ జిమ్​లోనే తన సమయం గడుపుతుందట. ఈ భామకు ఫిట్​నెస్ అంటే చాలా ఇష్టమట. ఇక ఈ శర్మ సిస్టర్స్ జిమ్ ఔట్​ఫిట్​లోనూ కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తుంటారు. ముఖ్యంగా నేహా శర్మ తన జిమ్ ఔట్​ఫిట్స్​లోనూ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ జిమ్​కు వెళ్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో నేహా చాలా ఫిట్​గా హాట్​గా కనిపిస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here