Sir : ‘సార్’ మొదటి రోజు వసూళ్లు.. స్టార్ హీరోలకు కూడా సాధ్యం కానీ అరుదైన రికార్డ్స్

- Advertisement -

Sir : కోలీవుడ్ లో హిట్టు మీద హిట్టు కొడుతూ విభిన్నమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజిని ఏర్పర్చుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది ధనుష్ మాత్రమేనని కళ్ళు మూసుకొని చెప్పేయొచ్చు.’అసురన్’ సినిమాతో ఉత్తమ నటుడిగా ఆయన జాతీయ అవార్డుని కూడా అందుకున్నాడు.అంతే కాకుండా రీసెంట్ గానే హాలీవుడ్ లో అడుగుపెట్టాడు.అలా చూస్తూ ఉండగానే ఎవ్వరు అందుకోలేని రేంజ్ కి వెళ్లిన ధనుష్ ఇప్పుడు టాలీవుడ్ లోకి ‘సార్’ మూవీ ద్వారా అడుగుపెట్టాడు.

Sir :
Sir :

ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సూర్య దేవర నాగవంశీ ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై నిర్మించాడు.నేడు తెలుగు మరియు తమిళం బాషలలో గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమాకి ప్రీమియర్ షోస్ నుండే పాజిటివ్ రెస్పాన్స్ రావడం తో అటు తమిళం లోను, ఇటు తెలుగులోనూ బంపర్ ఓపెనింగ్స్ దక్కాయి.మొదటి రోజు ఈ సినిమాకి ఎంత వసూళ్లు వచ్చాయో ఇప్పుడు మనం చూడబోతున్నాము.

danush

ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల నుండి 3 కోట్ల రూపాయిల వరకు షేర్ వసూళ్లు వచ్చాయని తెలుస్తుంది.ఈ చిత్ర నిర్మాత కాసేపటి క్రితమే ప్రెస్ మీట్ ద్వారా ‘గతం లో తెలుగు లో సూపర్ హిట్ గా నిల్చిన ధనుష్ గారి రఘువరన్ బీటెక్ ఫుల్ రన్ ని ‘సార్’ చిత్రం మొదటి రోజే దాటేసింది’ అంటూ చెప్పుకొచ్చాడు.’రఘువరన్ బీటెక్’ సినిమా ఇక్కడ ఫుల్ రన్ లో 3 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.

- Advertisement -
danush sir

నిర్మాత ఆ సినిమాకంటే ‘సార్’ మొదటి రోజు వసూళ్లు ఎక్కువ వచ్చాయి అని చెప్పాడు కాబట్టి కచ్చితంగా మూడు కోట్ల రూపాయలకు పైగానే మొదటి రోజు వసూళ్లు వచ్చాయని చెప్తున్నారు ట్రేడ్ పండితులు.ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా తెలుగు వెర్షన్ కి ఆరు కోట్ల రూపాయలకు జరిగింది.మొదటి రోజే 50 శాతం కి పైగా రికవరీ అయిపోయింది.వీకెండ్ లోపు బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి భారీ లాభాల్లోకి ఈ సినిమా అడుగుపెట్టబోతుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు.మొత్తానికి తెలుగు లో ధనుష్ మొదటి సినిమాతోనే భారీ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

movies stils
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here