ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మెసేజ్.. తెగ ఖుష్ అయిపోయిన బాలీవుడ్ బ్యూటీ‘ధడక్’ మూవీతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది అతిలోక సుందరి తనయ జాన్వీ కపూర్. తన మొదటి కో-స్టార్ ఇషాన్ కట్టర్ తో షూటింగ్ సమయంలో ప్రేమలో పడినట్లు వార్తలొచ్చాయి. ఇద్దరు తరచూ చెట్టాపట్టాలేసుకుని డిన్నర్లు, పార్టీలకు కూడా వెళ్లేవారు. ఎక్కడ చూసిన ఇద్దరు కలిసే కనిపించడంతో ఇద్దరు ప్రేమలో ఉన్నారని బాలీవుడ్ మీడియా కోడే కూసింది. అయితే కొంతకాలం తర్వాత వీరిద్దరూ విడిపోయారనే వార్తలొచ్చాయి. 

అయితే తాజాగా ‘మిలీ’ సినిమాతో జాన్వీ.. ‘ఫోన్ బూత్’ మూవీతో ఇషాన్ ఫుల్ బిజీ అయిపోయారు. ఇషాన్ తో బ్రేకప్ తర్వాత జాన్వీ సింగిల్ గానే మిగిలిపోయింది. ఇషాన్ మాత్రం మరో స్టార్ కిడ్ అనన్యా పాండేతో లవ్ లో పడి ఆమెకు కూడా బ్రేకప్ చెప్పేశాడు.

తాజాగా ‘మిలీ’ మూవీ ప్రమోషన్స్‌లో జాన్వీని ఇషాన్‌ గురించి విలేకర్లు ప్రశ్నించగా.. అతడు తనకి మంచి స్నేహితుడని చెప్పింది జాన్వీ.‘‘మా ఇద్దరి కెరీర్‌ ఒకేసారి మొదలైంది. మేమిద్దరం మంచి స్నేహితులం. ‘మిలీ’ రిలీజ్‌కు అభినందనలు చెబుతూ ఇటీవల తను మెసేజ్‌ పంపించాడు. నాకెంతో ఆనందంగా అనిపించింది. అతడు నటించిన ‘ఫోన్‌బూత్‌’ మంచి విజయాన్ని అందుకోవాలని రిప్లై ఇచ్చాను’’ అని చెప్పింది జాన్వీ. 

‘ఫోన్‌బూత్‌’పై స్పందిస్తూ.. సినిమా ట్రైలర్‌ తనకెంతో నచ్చిందన్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంతకం పెట్టడానికి ముందే ఇషాన్‌ తనకు ఈ కథ గురించి చెప్పాడని, తాను కూడా ఈ సినిమా రిలీజ్‌ కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పింది జాన్వీ.