Nayanthara : హీరో మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా కన్నప్ప. ఆయన స్వీయ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా నుంచి గతంలో హీరోయిన్ నుపుర్ సనన్ తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇంతలోనే ఈ సినిమాలో ప్రభాస్, నయనతార జంటగా నటించనున్నారని టాపిక్ వైరల్ అవుతోంది. ప్రభాస్, నయనతార తొలిసారిగా యోగి సినిమాలో నటించారు.

ఆ సినిమా ఫలితం ఎలా ఉన్న ప్రభాస్, నయన్ కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇప్పుడు 16 ఏళ్ల తర్వాత మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీ ద్వారా జత కట్టనున్నారని వార్తలు హల్ చల్ చేశాయి. ప్రభాస్, నయనతార శివపార్వతుల్లా దర్శనం ఇవ్వనున్నారట. అంటే ఇందులో ఇద్దరు కామియో రోల్స్ చేయనున్నారని సమాచారం.
గత వారం ఈ సినిమా రూమర్అప్డేట్స్ ప్రకారం బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఈ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టనున్నట్లు ట్విట్టర్ ద్వారా ఒక ట్రేడ్ అనలిస్ట్ ఈ విషయాన్ని తెలియజేశారు. అక్షయ్ కుమార్ ఈ సినిమాలో శివుడిగా కనిపించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డాడు. ఎందుకంటే బాలీవుడ్లో ఓ మై గాడ్, ఓ మై గాడ్ 2 సినిమాలలో అక్షయ్ కుమార్ దేవుడిగా కనిపించాడు. ఈ సినిమాలో కూడా అదే పాత్ర చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఓ మై గాడ్ 2లో ఆయన శివుడిగా కనిపించి ఆకట్టుకున్నారు.
అందుకే కన్నప్పలోనూ అక్షయ్‌కుమార్ ను శివుడిగా చూపించేలా దర్శకుడు స్క్రిప్ట్ మార్చారని టాక్ వినిపిస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్‌ను నందీశ్వరుడిగా చూపించే ప్రయత్నం చేయబోతున్నారట. శివుడి పాత్రలో ఈ సినిమాలో అక్షయ్ ఎంట్రీ ఇవ్వడంతో.. ఈ విషయం తెలుసుకున్న నయనతార సినిమా నుంచి తప్పుకుందంటూ ప్రచారం జరుగుతోంది. అంతేకాదు నయనతార ప్లేసులో హీరోయిన్ కాజల్ అగర్వాల్ ను టీం రంగంలోకి దింపబోతున్నారట. ప్రస్తుతం ఇదే న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.