Kriti Sanon : రెడ్ లెహంగాలో పెళ్లి కూతురు వైబ్స్ ఇస్తున్న ఆదిపురుష్ బ్యూటీ

- Advertisement -

కృతి సనన్.. సోషల్ మీడియాలో ఈ భామ లేటెస్ట్ ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా ఈ భామ ట్రెడిషనల్ ఔట్ ఫిట్ లో ఫొటోషూట్ చేసింది. అది ఎక్కడో.. ఫొటో స్టూడియోలో కాదండోయ్ సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుడి సన్నధిలో. బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్, ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రాతో కలిసి కృతి కాశీకి వెళ్లింది. అక్కడ కాశీనాథుని ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన డ్రెస్సులో కృతి ఫొటోషూట్ చేసింది.

రెడ్ కలర్ లెహంగాలో కృతి అచ్చం పెళ్లి కూతురులా కనిపిస్తోంది. బ్రైడల్ ఔట్ ఫిట్ లో కృతి అందాన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. రెడ్ కలర్ దుపట్టాను తలపై నుంచి ధరించి అచ్చం పెళ్లి కుమార్తెలాగే కనిపిస్తున్న కృతి ఫొటోలు వైరల్ అవుతున్నాయి. గోల్డ్ టిష్యూ సిల్క్ తో రెడ్ బార్డర్ లో ఈ లెహంగాను డిజైన్ చేశారు. ఈ ఔట్ ఫిట్ లో కృతి చాలా అందంగా కనిపిస్తోంది. పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయిలకు ఈ లెహంగా తప్పనిసరిగా ఫేవరెట్ అవుతుందని చెప్పొచ్చు.

- Advertisement -

కృతిని ఈ ఔట్ ఫిట్ లో చూసిన ఫ్యాన్స్ భలే ఖుష్ అవుతున్నారు. మొదట ఫొటోలు చూసి ఈ భామ పెళ్లి చేసుకుందేమో అనుకున్నారు. కానీ క్యాప్షన్ చూసిన తర్వాత ఇది ఫొటోషూట్ అని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. ఈ లెహంగాలో కృతి చాలా బ్యూటీఫుల్ గా కనిపిస్తుందని కామెంట్లు చేస్తున్నారు. బ్యూటిఫుల్ బ్రైడ్ అంటూ హార్ట్ ఎమోజీలు పోస్టు చేస్తున్నారు.

కృతి సనన్.. టాలీవుడ్ లో మహేశ్ బాబుతో వన్ నేనొక్కడినే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాగచైతన్యతో కలిసి నటించింది. ఇక ఇటీవల ఈ భామ ప్రభాస్ తో కలిసి ఆదిపురుష్ మూవీలో సీతగా నటించి అలరించింది. ఇక బాలీవుడ్ లో కృతి వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఇటీవలే తేరీ బాతోమే ఐసా ఉల్జా జియా, క్రూ అనే చిత్రాలతో హిట్ కొట్టింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here