ఇండస్ట్రీలో సౌత్ లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ఓ స్పెషల్ ఐడెంటిటీని సంపాదించుకున్నారు నయనతార. సినిమాలే కాకుండా వరుస లవ్ స్టోరీస్ తో కొన్నాళ్ల పాటు సోషల్ మీడియాను ఏలేశారు నయన్. ప్రస్తుతం దర్శకుడు విఘ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకుని కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తూనే తక్కువ సంఖ్యలో సినిమాలు చేస్తున్నారు నయన్. ఒకప్పుడు విక్టరీ వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్ హీరోలతో పాటు ఎన్టీఆర్, ప్రభాస్ వంటి యంగ్ హీరోలతో కూడా చేసి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు. కానీ ప్రస్తుతం దాదాపు తెలుగు సినిమాలేవీ ఆమె ఒప్పుకోలేదు. కోలీవుడ్ సినిమాలతోనే తాను ఫుల్ బిజీ అయిపోయింది. ఇది ఇలా ఉంచితే తాను త్వరలోనే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. నయన్ తొలిసారిగా బాలీవుడ్ బాద్ షా షారూఖ్ సరసన జవాన్ చిత్రంతో హిందీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టనుంది.

తమిళ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కింది. జవాన్
. నిర్మాణంలో రాజీ పడకుండా హై బడ్జెట్ తో ఈ యాక్షన్ జానర్ ను నిర్మిస్తున్నారు. ఈ సినిమా హిట్ అయితే నయన్ బాలీవుడ్లో పాగా వేయడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో నయనతార టాలీవుడ్ పై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. తెలుగులో ఆఫర్స్ వచ్చినా తను నటించాలంటే కొన్ని కండీషన్లు పెడుతుందని టాక్ నడుస్తోంది. సినిమా చేయాలంటే ఆ సినిమాలో చేసే హీరోకు సమానంగా తనకు రెమ్యూనరేషన్ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తుందట. అప్పుడే సినిమా చేస్తానని లేదంటే కుదరని కరాఖండీ చెప్పేస్తుందట. దాంతో నిర్మాతలు ఏం చెప్పాలో అర్థం కాక సైలంట్ అయిపోతున్నారట. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యునరేషన్ రూ. 50కోట్ల నుంచి 100 కోట్ల రేంజ్ ఉంది. అంతే సమానంగా రెమ్యునరేషన్ నయనతారకు ఇస్తే నిర్మాతలు రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. దీంతో నయన్ కు ఇంత డబ్బు ఇచ్చేందుకు ఇష్టపడడం లేదట. ఈ కండీషన్ విన్న నెటిజన్లు నయన్ పై తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు.
