Pavitra Naresh : మరోసారి కెమెరాలకు చిక్కిన నరేష్ – పవిత్రా లోకేష్.. వీడియో వైరల్..

- Advertisement -

Pavitra Naresh : గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జంట నరేష్ -పవిత్రా లోకేష్.. వయస్సుతో సంబంధం లేకుండా ఘాటు ముద్దులతో రెచ్చిపోయారు.. అంతే కాదు త్వరలోనే పెళ్లి అని అనౌన్స్ కూడా చేశారు.. ఎప్పటికప్పుడు ఈ జంట ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూ చాలామందికి మంచి ఎంటర్టైన్మెంట్ అందించిందని చెప్పడంలో సందేహం లేదు. ప్రపంచం ఏమనుకుంటే మాకేంటి .. మా ఇష్టం వచ్చినట్టు మేము బ్రతుకుతాము అనే ధోరణిలో వీరిద్దరు వ్యవహరిస్తుండడంతో కొంతమంది నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. వీరికి సంబందించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది..

pavitra naresh
pavitra naresh

నటుడు నరేష్ ఎన్నో విభిన్నమైన పాత్రలను జనాలకు ఆకట్టుకుంటూ తనకంటు ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకున్నాడు.. అయితే ఈయన ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురు భార్యలకు దూరంగా ఉన్న ఈయన.. నాలుగవ పెళ్లిగా పవిత్ర లోకేష్ ను వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి.. ఈ వార్తలు వచ్చినప్పుడు అందరూ పుకార్లు మాత్రమే అనుకున్నారు. కానీ ఈ ఏడాది వీరిద్దరూ లిప్ కిస్ ఇచ్చుకుంటూ విడుదల చేసిన వీడియో సంచలనం సృష్టించింది. అంతేకాదు ఈ వీడియో చూసిన చాలా మంది సెలబ్రిటీలు కూడా వీరిపై మండిపడ్డారు ..సభ్య సమాజానికి ఏం నేర్పిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది ఇలా ఉండగా.. మొన్న నరేష్ ను వదిలేసి వెళ్లిన పవిత్ర పై రకరకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు మళ్ళీ ఇద్దరు కలిసిపోయారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. ఆ వార్తలకు ఆజ్యం పోస్తూ వీరిద్దరూ మరోసారి కెమెరాలకు చిక్కారు.. తాజాగా మంచు మనోజ్ రెండో పెళ్లి జరిగిన విషయం తెలిసిందే.. ఆయన పెళ్లికి సన్నిహితులను వివాహనికి ఆహ్వానించారు.. ఆ కార్యక్రమానికి వీరిద్దరూ కలిసి వెళ్లారు.. పవిత్ర లుక్ పూర్తిగా మారిపోయింది.. అలాగే నరేష్ కూడా స్మార్ట్ గా కనిపించారు..పవిత్ర నరేష్ ఒకరికోసం మరొకరు అన్నట్లు కాసేపు కూడా విడిచి పెట్టలేదు.. అందుకు సంబందించిన కొన్ని కొన్ని ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. మీరు కూడా వాటిపై ఓ లుక్ వేసుకోండి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here