Pranathi Reddy : మంచు మనోజ్ మొదటి భార్య ప్రణతి రెడ్డి ఇప్పుడు ఎక్కడ ఉంది..? ఆమె కూడా 2వ పెళ్లి చేసుకుందా..?

- Advertisement -

Pranathi Reddy : మంచు మనోజ్ నిన్న రాత్రి భూమా మౌనిక రెడ్డి ని వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. తన సోదరి లక్ష్మి ప్రసన్న స్వగృహం లో బంధుమిత్రుల సమక్ష్యం లో ఈ వివాహం చాలా సాధారణంగా జరిగింది. ఈ పెళ్ళికి సినిమా ఇండస్ట్రీ నుండి కేవలం మనోజ్ కి ఎంతో సన్నిహితంగా ఉన్న వాళ్ళు మాత్రమే హాజరయ్యారు. మరోపక్క మౌనిక రెడ్డి వైపు నుండి కూడా కేవలం కొంతమందిని మాత్రమే ఈపెళ్లికి ఆహ్వానించారు.

Pranathi Reddy
Pranathi Reddy

ఇది ఇలా ఉండగా మనోజ్ తన మొదటి భార్య ప్రణతి రెడ్డి తో విడాకులు తీసుకొని నాలుగేళ్లు కావొస్తుంది. 2015 వ సంవత్సరం లో వీళ్లిద్దరి పెళ్లిని అతిరథ మహారథుల సమక్ష్యం లో మోహన్ బాబు అంగరంగ వైభవం గా జరిపించాడు, కొంతకాలం దాంపత్య జీవితం బాగానే సాగింది కానీ , మధ్యలో కొన్ని అనుకోని సంఘటనలు మరియు పరిణామాలు చోటు చేసుకొని విడాకులు తీసుకోవాల్సి వచ్చింది.

manoj wife Pranathi Reddy

అయితే మనోజ్ తో విడాకులు తీసుకున్న తర్వాత ప్రణతి రెడ్డి ఏమైంది.? అసలు ఎక్కడ ఉంది అనేది ఎవరికీ తెలియదు. కానీ కొన్ని విశ్వసనీయ వర్గాల నుండి సేకరించిన సమాచారం ప్రకారం ఆమె విడాకులు తీసుకున్న తర్వాత అమెరికా కి వెళ్లిపోయిందని తెలుస్తుంది. వృత్తి రీత్యా ఆమె ఒకే ఇల్లుస్ట్రేషన్ ఆర్టిస్టు. పెళ్ళికాకముందు నుండే ఆమె ఈ తన ప్రాఫెషన్ లో ఉన్నత స్థాయిలో ఉండేది, ఇప్పుడు విడాకులైన తర్వాత ఆమె ఈ వృత్తి బిజీ గా ఉంటూ కాలం గడిపేస్తుంది.

- Advertisement -
Manchu Manoj Pranathi Reddy

అయితే మంచు మనోజ్ నుండి విడిపోయిన తర్వాత ఈమె కూడా రెండవ పెళ్లి చేసుకుందా అనే సందేహాలు ఏర్పడ్డాయి, కానీ అలాంటిదేమి లేదని, ప్రస్తుతం ఆమె సింగల్ గానే తన జీవితాన్ని కొనసాగిస్తుందని సమాచారం. కానీ మనోజ్ మాత్రం పాత విషయాలన్నీ మర్చిపోయి రెండవ పెళ్లి చేసుకోవడం గమనార్హం. ఇది ఇలా ఉండగా ప్రణతి రెడ్డి కి సంబంధించిన లేటెస్ట్ ఫోటో ఒకటి మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

Pranitha reddy latest photos
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here