Big breaking : సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న Naresh – Pavitra.. నిజామా?

- Advertisement -

Naresh Pavitra సోషల్ మీడియాను ఊపేస్తున్న వార్త నరేష్, పవిత్రా లోకేష్ రిలేషన్.. కొన్ని రోజుల నుంచి వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.పెళ్లి చేసుకోబోతున్నట్టు న్యూ ఇయర్ సందర్భంగా ఆమెను లిప్ కిస్ చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే..దీంతో నరేష్‌, పవిత్ర త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ అందరికి ఓ క్లారిటీ వచ్చేసింది. అయితే ఈ వీడియో బయటకు వచ్చినప్పటి నుంచి నరేష్ మూడో భార్య రమ్య మరింతగా రెచ్చిపోయింది.. నరేష్ పై దాడి కూడా చేయించిందని నరేష్ కోర్టు మెట్లు ఎక్కాడు.. ఇప్పుడు సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తుంది..ఇందుకు సంబందించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

Naresh Pavitra
Naresh Pavitra

నరేష్ ఎన్నో సినిమాల్లో నటించి ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకున్నాడు.. అయితే ఈయన ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురు భార్యలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే..ఇక ఇప్పుడు నాలుగవ పెళ్లిగా పవిత్ర లోకేష్ ను వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి.. ఈ వార్తలు వచ్చినప్పుడు అందరూ పుకార్లు మాత్రమే అనుకున్నారు. కానీ ఈ ఏడాది వీరిద్దరూ లిప్ కిస్ ఇచ్చుకుంటూ విడుదల చేసిన వీడియో సంచలనం సృష్టించింది. అంతేకాదు ఈ వీడియో చూసిన చాలా మంది సెలబ్రిటీలు కూడా వీరిపై మండిపడ్డారు..

naresh

ఆ తర్వాత చాలా వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి.. ఇటీవల మంచు మనోజ్ రెండో పెళ్లికి హాజరై మరోసారి కెమెరాలకు చిక్కారు..కొత్త జంటలాగే ఒకరిని విడిచి మరొకరు ఉండలేక పోయారు..అందుకు సంబందించిన కొన్ని కొన్ని ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.. ఇక ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు.. ఈ మధ్యే వీరిద్దరూ పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. మైసూరు లో అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకున్నారు.. ఈ వార్తలో నిజమేంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. మరి నిజమేంటో వారిద్దరే చెప్పాలి.. ఏది ఏమైనా మరోసారి ఇది వైరల్ గా మారింది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here