Big twist : మంచు మనోజ్ రెండో పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. పెళ్లికి ఎవరెవ్వరు వస్తారంటే?

- Advertisement -

Big twist మంచు మోహన్ బాబు కొడుకు మంచు మనోజ్ గురించి అందరికి తెలుసు..ఎన్నో సినిమాల్లో నటించాడు కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వలేదు.. దాంతో సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకున్నాడు. చెప్పుకోదగ్గ సినిమాలు చాలా చేశాడు కానీ కెరియర్లో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకోలేదనే బాధ ఆయనకు ఉంది. అయితే మంచు మనోజ్ ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అనే ఒక పాన్ ఇండియా సబ్జెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దాని కంటే ఎక్కువగా పర్సనల్ కారణాలతో మంచు మనోజ్ ఈ మధ్య వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు… ఈ మధ్య రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి..

Big twist
Big twist

కర్నూలు జిల్లాకు చెందిన భూమా కుటుంబానికి చెందిన అమ్మాయిని రెండో వివాహం చేసుకోబోతున్నాడు అనే వార్త పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా మారింది. వాస్తవానికి మంచు మనోజ్ గతంలోనే ఒక అమ్మాయిని ప్రేమించి పెద్దలు అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు. కానీ ఎందుకో తెలియదు వారి ఇద్దరికీ విడాకులు అయ్యాయి. విడాకులు అయిన తర్వాత ఒంటరిగానే జీవిస్తూ వస్తున్న మంచు మనోజ్ భూమా కుటుంబానికి చెందిన భూమా మౌనిక రెడ్డితో ప్రేమలో పడ్డారని ప్రచారం ఊపందుకుంది..

దానికి తగ్గట్టుగానే వారిద్దరూ కలిసి పలు సందర్భాలలో కనిపించడంతో వీరు ఇక వివాహం చేసుకుంటారని వార్త పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారింది. అయితే గత కొద్ది రోజులుగా ఈ విషయం మీద ఎలాంటి వార్తలు బయటికి రాలేదు, కానీ తాజాగా అందుతున్న సమాచారం మేరకు మార్చి మూడో తేదీన మంచు మనోజ్ మౌనిక రెడ్డి ఇద్దరు వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అటు మంచు మనోజ్ తో పాటు భూమా మౌనిక రెడ్డికి కూడా ఇది రెండవ వివాహమే. భూమా కుటుంబానికి మంచు మోహన్ బాబు కుటుంబానికి చాలా రోజుల నుంచి సాన్నిహిత్యం ఉంది.

- Advertisement -

ఒక కుటుంబం సినిమాల్లో ఉన్నా మరొక కుటుంబం రాజకీయాల్లో ఉండడంతో మంచు మనోజ్ సహా భూమా మౌనిక రెడ్డికి చాలా రోజుల నుంచే పరిచయం ఉందని భూమా మౌనిక రెడ్డి మొదటి వివాహానికి సైతం మంచు మనోజ్ హాజరయ్యారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇక ఈ వివాహానికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన కూడా మంచు మనోజ్ జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ వివాహం మంచు మోహన్ బాబుకి ఇష్టం లేదని ఒక పక్క ప్రచారం జరుగుతోంది. మరి వివాహానికి మంచు మోహన్ బాబు హాజరవుతారా లేదా అనేది చూడాల్సి ఉంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here