నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ లో ఒక సునామి లాగ నడిచిన రీ రిలీజ్ ట్రెండ్ ఇప్పుడు పలుచబడిందా?, అభిమానులు మరియు ఆడియన్స్ థియేటర్స్ లో చూసేందుకు ఇష్టపడడం లేదా? అని అంటే అవుననే అంటున్నారు ట్రెండ్ పండితులు. అందుకు ఉదాహరణగా రీసెంట్ గా విడుదలైన ‘సింహాద్రి’ మరియు ‘నరసింహ నాయుడు’ సినిమాలే అని అంటున్నారు.

గత నెలలో ‘సింహాద్రి’ చిత్రాన్ని ఎంత హంగులు మరియు ఆర్భాటాల నడుమ విడుదల చేసారో ప్రతీ ఒక్కరికీ తెలిసిందే.సినిమా నెల రోజుల ముందు నుండే ప్రొమోషన్స్ ఒక రేంజ్ లో చేసారు, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసి భారీ ఎత్తున సెలబ్రిటీస్ ని కూడా ఆ ఈవెంట్ కి వచ్చేలా చేసారు.అంత చేసి కచ్చితంగా ‘ఖుషి’ ఫుల్ రన్ రికార్డ్స్ ని కొట్టాలనే కసితో వచ్చిన ఈ సినిమా, చివరికి ఖుషి మొదటి రోజు వసూళ్లను ఫుల్ రన్ లో క్రాస్ చేసింది.

ఇక ఈరోజు బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన ‘నరసింహ నాయుడు’ సినిమా అయినా ఖుషి రికార్డ్స్ ని బద్దలు కొడుతోంది అనుకుంటే, ఈ చిత్రం ఇప్పటి వరకు విడుదలైన అన్నీ రీ రిలీజ్ సినిమాలకంటే తక్కువ వసూళ్లను రాబట్టి నందమూరి ఫ్యాన్స్ పరువుని తీసేసింది. ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు కేవలం 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయట.

ఎప్పుడో 50 ఏళ్ళ క్రితం విడుదలైన సూపర్ స్టార్ కృష్ణ ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రం మొన్న కృష్ణ జయంతి నాడు విడుదల చేస్తే,35 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కానీ నరసింహ నాయుడు చిత్రం మొదటి రోజు గ్రాస్ ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రం గ్రాస్ కి దరిదాపుల్లో కూడా వెళ్లలేకపోవడం ఇప్పుడు అందరినీ ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం.
